సినిమా... మీడియా.. ఈ రెండింటిలో ఒకదాని అవసరం మరొకదానికి ఉంది. ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. మరి ఈ రెండింటి మధ్య ఘర్షణ వస్తే.. ఎలా ఉంటుంది. ఇప్పుడదే జరుగుతోంది..

తాము ఏ నిర్ణయం తీసుకుంటే మీడియా అంతా దాన్ని పాటించాలని సినిమా పెద్దలు గతంలో హుకుం జారీ చేసేవారు. ఆంధ్రజ్యోతికి ఎదురైన ఈ అనుభవమే.. రాధాకృష్ణకూ సినీపరిశ్రమకూ  చెడేలా చేసింది. హాస్య నటుడు బ్రహ్మానందంపై ఏబీఎన్ ఓ కథనం ప్రసారం చేసిందట.

బ్రహ్మానందంపై ఏబీఎన్ కథనాన్ని గమనించిన అప్పటి ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్‌  ఏబీఎన్ రాధాకృష్ణకు ఫోన్ చేసి ‘‘మా సభ్యుడిపై కథనాలు ఎలా ప్రసారం చేస్తారు’’అని అడిగారట. అసలే మోనార్క్ లాంటి రాధాకృష్ణ.. ‘ఆ విషయం అడగడానికి మీరెవరని ఉల్టా దబాయించారట.

మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మీ సంస్థ ద్వారా న్యాయపరంగా ప్రొసీడ్‌ అవ్వమని బదులిచ్చాడట రాధాకృష్ణ. అలా వారిద్దరిమధ్య బ్రహ్మాందం కారణంగా చెడిందట. ఈ విషయాన్ని రాధాకృష్ణ తన పత్రికలో బాహాటంగా రాయడం విశేషం.  



మరింత సమాచారం తెలుసుకోండి: