మంత్రి గారి ఇంట్లో తుపాకీ పేలడమంటే మామూలు విషయం కాదు. ఏదో జరిగే ఉంటుంది అనుకుంటున్నారా.. ఐతే.. అక్కడ అంత సీనేంలేదంటున్నారు పోలీసులు.. పొరపాటే తప్ప ఇందులో అంత సీన్ ఏమీ లేదంటున్నారు.


మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు



అసలు ఏం జరిగిందంటే.. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట్లో శనివారం రాత్రి తుపాకీ పేలింది. మంత్రి నివాసంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చేతిలో తుపాకి పొరపాటున పేలింది. విజయవాడ గొల్లపుడిలోని మంత్రి నివాసం వద్ద AR కానిస్టేబుల్ శ్రీనునాయక్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 

రాత్రి 9గంటల సమయంలో కానిస్టేబుల్ తుపాకి శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా పేలింది. తుపాకీ నుంచి తూటా దూసుకొచ్చి ఇంటి పైకప్పును తాకింది.  ఐతే.. లక్కీ ఏమిటంటే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 

విషయం తెలియగానే.. ఘటన స్థలాన్ని DCP అశోక్ కుమార్ పరిశీలించారు. ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. తుపాకి పొరపాటునే పేలిందని నిర్థరించుకున్నారు. తుపాకీ మిస్ ఫైర్ అయిన సమయంలో మంత్రి దేవినేని ఇంట్లో లేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: