ఇవి కళాకారుల సంఘానికి జరుగుతున్న ఎన్నికలా..? లేక సాధారణ రాజకీయ ఎన్నికల అనే విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రణరంగ వాతావరణాన్ని తలపించాయి. పక్తు రాజకీయ నాయకుల తరహాలో ప్రత్యర్ధి వర్గంపై విమర్శలు, ఆరోపణలతో మీడియా సాక్షిగా రచ్చ రచ్చ చేశారు. తెరపై ఆదర్శవంతమైన పాత్రల్లో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆర్టిస్టులు నిజ జీవితంలో ఇలా ప్రవర్తిస్తారా..? అంటూ సామాన్య ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కళాకారుల కుళ్ళు రాజకీయాలు చూసి ముక్కున వేలేసుకున్నారు. ఎన్నికల తర్వాత మేమంతా ఓ కుటుంబంగా కలిసిపోతాం అని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గెలుపు తర్వాత పరిస్థితులు చూస్తే, ఆ వాతావరణం కనిపించడం లేదు.

గెలుపొందిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అర్జునిడిలా నిలబడ్డానని విజయ గర్వంతో వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ ఇంకా హాస్య నటుడిలా ప్రవర్తిస్తున్నారు. 'మా' నిర్వహించే కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయను, చైతనైన సహాయం చేస్తానని ప్రకటించారు. అప్పుడే వీరి మధ్య సఖ్యత లేదని అర్ధమైంది. రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా గెలిచినా, ప్యానల్లో అత్యధిక సభ్యులు జయసుధ వర్గం నుండి గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా గెలిచిన సీనియర్ నరేష్, తమ మద్దతు లేకుండానే 'మా' కొత్త అధ్యక్షుడు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.. దీంతో మరోసారి 'మా'లో కుళ్ళు రాజకీయాలు బయటపడ్డాయని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: