రాజధానిలో పోలీస్ రిక్రూట్‌మెంట్‌తో మ‌రోక్క‌సారి ఫ్రీ జోన్ వివాదం తెరపైకి వ‌చ్చింది. ఏపీ పున‌ర్వీభ‌జ‌న చట్టం ప్ర‌కారం ప‌ది సంవ‌త్స‌రాలు పాటు ఉమ్మ‌డి రాజ‌ధాని గా హైద‌రాబాద్ ను ప్ర‌క‌ట్టించింది. గ‌తంలోహైద‌రాబాద్ ఫ్రీ జోన్ కావ‌డం తో రిక్రూట్‌మెంట్ జ‌రిగితే రాష్ట్రంలోనివ‌శించేవారు ఎవ‌రైనా స్థానికులు గా గుర్తించాలని సీమాంధ్రులు ఒక‌వైపు,కాదు హైద‌రాబాద్ 6 జోన్ లో భాగం కావ‌డం తో తెలంగాణ వారికే చెందుతుంద‌ని మ‌రోవైపు వాదించుకోవ‌డమే కాదు, ఒక మోస్తారు యుధ్దాలు కూడా జ‌రిగాయి.ఎట్టకేలకు గ‌త‌ ప్రభుత్వాలు ఫ్రీజోన్‌ తొలగించాయి. హైద‌రాబాద్ ఉమ్మ‌డిరాజ‌ధాని కావ‌డంతో విభ‌జ‌నానంత‌రం కూడా జోన్ ల వివాదం తెర పైకి రావ‌డంప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

పోలీస్ రిక్రూట్‌మెంట్


రాజధానిలో పోలీస్ రిక్రూట్‌మెంట్ లో అపోహలు అవసరంలేదని పోలీస్‌ శాఖస్పష్టం చేసింది. ఫ్రీ జోన్ పేరుతో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రంనిజంలేదని పోలీస్ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. గ‌త‌ ఉమ్మడిరాష్ట్రంలోనే ఫ్రీ జోన్ (14ఎఫ్) ఎత్తివేశారు. దీనితో సిటీ పోలీస్రిక్రూట్‌మెంట్ మొత్తం ఇక స్థానికులతోనే జరుగతుందని తెలిపారు.హైదరాబాద్‌లో పుట్టినవారికే ఇక్కడి పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందే అవకాశంకల్పిస్తామ‌ని తెలిపారు. దీనిపై అపోహలను, గందరగోళ ప్రచారాన్నినమ్మవద్దనివారు కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పోలీస్ నియామకాల్లో ఫ్రీజోన్ వల్లతెలంగాణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. 14ఎఫ్ పేరుతోసీమాంధ్రులు కుట్ర సాగించి తమ ప్రాంత వారిని రాజధాని పోలీస్ విభాగంలోనియమించుకున్నారు. అప్పట్లో చేసిన పోరాటంతోపాటు తెలంగాణ ప్రాంత పోలీస్అధికారులు, ఉద్యోగ సంఘాలు పోరాటం చేయడంతో 14ఎఫ్‌ను ఎట్టకేలకు గ‌త‌ప్రభుత్వాలు తొలగించాయి. దీనితో ఫ్రీజోన్‌కు చెక్‌పడింది. ప్రత్యేకరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఇకనుంచి 6వ జోన్‌లో భాగంగానే సిటీపోలీస్ నియామకాలు జరుగనున్నాయి.


పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నియామకాలు జిల్లా యూనిట్ల వారీగా జరుగుతాయి.అలాగే ఎస్‌ఐల నియామకాలు మాత్రం జోన్లవారీగా జరుగుతాయి. త్వరలో రాబోతున్నకానిస్టేబుల్ నియామక ప్రక్రియలో స్థానికులకే పూర్తి అవకాశం ఉంటుందనిఉన్నతాధికారులు తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా 80 శాతం అవకాశాలుహైదరాబాద్ జిల్లాలో పుట్టిపెరిగిన వారికే ఉంటాయి. మిగతా 20 శాతం కోటాలోరాష్ట్రంలోని ఇతర జిల్లాల వారితో పాటు హైదరాబాద్‌వారు కూడా పోటీపడవచ్చు.ఇకపోతే ఎస్‌ఐ నియామకానికి వచ్చేసరికి 6వ జోన్‌లో భాగంగా నియామకాలుజరుగుతాయి. ఆరోజోన్‌లో స్థానికులకు 70శాతం అవకాశం ఉంటుంది. మిగిలిన30శాతంలో 5వ జోన్‌తో పాటు 6వజోన్‌లోని అభ్యర్థులు కూడా పోటీపడవచ్చనిపోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో ఫ్రీజోన్ వల్ల సీమాంధ్రులే 80శాతం రాజధాని పోలీస్ విభాగంలో పాతుకుపోయారు. ఇక ఆ సమస్య లేదని, తెలంగాణప్రాంత అభ్యర్థులకే పూర్తి ఉద్యోగవకాశాలుంటాయని ఉన్నతాధికారులస్పష్టంచేశారు.

తెలంగాణ


గ‌త విలీన స‌మ‌యంలో తెలంగాణ, ఆంద్ర ప్రయోజనాలను కాపాడటానికి ఇరువురిమ‌ద్య 'పెద్దమనుషుల' ఒప్పందం కుదిరింది. తెలంగాణకు చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయం జరిగింది.మంత్రివర్గంలో కూడా రెండు ప్రాంతాలకు న్యాయమైన భాగస్వామ్యం ఉండాలని నేతలునిర్ణయానికి వ‌చ్చారు. కానీ ఇవేవీ అమలుకు నోచుకోలేదన్న భావన తెలంగాణాలోబలంగా వినిపించింది. ఇతర అంశాలతో పాటు ముల్కీ నిబంధనలు అమలు కావడంలేదంటూ 1969 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. అయితే ముల్కీనిబంధనలను హైకోర్టు కొట్టివేసింది. కానీ సుప్రీం కోర్టు 1972 సంవత్సరంఇచ్చిన తీర్పులో ఈ నిబంధనలను సమర్ధించింది. దీంతో జై ఆంధ్ర ఉద్యమంఊపందుకుంది. రాజధానిలో ఉద్యోగం చేసుకునే హక్కు కూడా లేదా అంటూ ఆంధ్రాప్రాంతం వారిలో ఆందోళన మొదలైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు.


రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా 11 నెలలు రాష్ట్రపతి పాలనవిధించారు. 1973 సంవత్సరంలో తిరిగి ఎన్నికలు జరిగాయి. అనంతరం పార్లమెంటుచట్టం చేసింది. దీంతో 'ముల్కీ' నిబంధనల స్థానంలో స్థానికుల హక్కుల్నిపరిరక్షించేందుకు 'సిక్స్ పాయింట్‌ ఫార్ములా'ను ప్రవేశపెట్టారు.విద్యాసంస్థల్లో ,ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలన్ననిబంధనలు వచ్చాయి. చివరకు ఈ సిక్స్ పాయింట్‌ ఫార్ములా కూడాపూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఈ ఉల్లంఘనలను సరిచేసేందుకు ఆనాటిప్రభుత్వం జివో 610ను తెచ్చింది. జివో మాత్రం వచ్చింది కానీ అది కూడాఅమలు కాలేదు. ఈ ఉల్లంఘనలు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం'గిర్‌గ్లానీ కమిటీ'ని నియమించింది. ఈ కమిటీ 2004 లోనే నివేదికనుసమర్పించింది. అమలులో రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడమే సమస్యగా మారింది.


హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌


దీంతో హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌ అంటూ మరో వివాదం మొదలైంది. రాష్ట్రపతిఉత్తర్వుల్లోని 14 ఎఫ్‌ నిబంధనను ఇందుకు ఉదాహరణ గా ఫ్రీ జోన్‌నుసమర్ధించేవారు చూపించారు. చాలాకాలం ప్రభుత్వం చోద్యం చూసి చివరకు 14ఎఫ్‌ను కేంద్రం తొలగించింది. దీంతో ఫ్రీ జోన్‌ వివాదం ముగిసింది. బహుశా ఈఐదు దశాబ్దాల్లో ప్రభుత్వాలు సంతృప్తికర పరిష్కారం చూపింది ఈ ఒక్కవిషయంలోనే అనుకోవచ్చు. పెద్ద మనుషుల ఒప్పందం నుంచి మొదలు 610 జీవో దాకఉన్న నిర్ణయాలు అమలు చేయాలని తెలంగాణవాదులు ప్రత్యేకంగా పోరాడినసందర్భాలు లేవు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఆందోళన చేశారు. రెండుప్రాంతాల నేతలు జీవో, ఒప్పందాల అమలుకు కృషి చేసి ఉంటే ఇప్పుడు కేంద్రంరాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు.


హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌దాని గా ఉడ‌టం తో మ‌రోసారి ఫ్రీ జోన్ వివాదం తెరపైకి రావ‌చ్చ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. విభ‌జ‌నానంతరం సీమాంద్రనిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని కావున హైద‌రాబాద్ ను ఫ్రీ జోన్గా గుర్తించి నియామ‌కాలను జ‌ర‌గాలని కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.మ‌రోవైపు తెలంగాణ పోలీస్ అధికారులు మాత్రం.. ఫ్రీజోన్ టెన్షన్‌తో పాటుసీమాంధ్రుల కుట్రలు ఉండ‌వ‌ని, తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికేఉద్యోగవకాశాలు లభిస్తాయని, మళ్లీ ఫ్రీజోన్ అని వస్తున్న ప్రచారంలో నిజంలేదని తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా రాజధాని రిక్రూట్‌మెంట్ కోసం శిక్షణశిబిరాలు, ఉచిత శిక్షణ కూడా ఇవ్వబోతున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.ఎది ఏమైనా జ‌ర‌గ‌బోయే నియామ‌కాలు ఎలా ఉండ‌బొతున్న‌యో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: