తెలుగుదేశం పార్టీ ఎంపీ లు గల్లా జయదేవ్‌, సీఎం రమేష్‌ల తీరుపై ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ము ఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకే పదవి కోసం ఇద్దరు ఎంపీ లు వేర్వేరుగా పోటీపడడంపై ఆదివారం ఇక్కడ చంద్రబాబు వద్ద ప్రస్తావనకు వచ్చింది. ఒకే పార్టీలో ఉండి ఒకే పదవికి ఇద్దరూ పోటీ పడి పార్టీ పరువును రచ్చ కీడ్చుతున్నారని బాబు ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ఇద్దరికీ ఆసక్తి ఉంటే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి తప్ప, ఈ రకంగా బహిరంగంగా పోటీ పడి పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య రాజీ కుదరని పక్షంలో వేరే అభ్యర్థిని ఎన్నిక చేసే మార్గాలను కూడా చూడాలని ఆయన పార్టీ నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీనిపై ప్రశ్నించినప్పుడు పార్టీ అధినేత తనతో ఈ విషయాలేవి మాట్లాడలేదని సీఎం రమేష్‌ చెప్పారు. ‘ఇందులో వివాదం ఏమీ లేదు. జయదేవ్‌ను కొంత మంది తప్పుదోవ పట్టించడం వల్లే ఈ సమస్య వచ్చింద’ని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: