ఎర్ర చందనం స్మగ్లర్ల వెనుక ఎవ‌రున్నారు..? వారికి ఎవ‌రైనాస‌హ‌క‌రిస్తున్నారా..? పోలీసుల ద‌ర్యాప్తులో ఎన్నో విస్మయకర వాస్తవాలుబయటకు వచ్చినట్లు తెలిసింది. ఏపీ, తమిళనాడు కు చెందిన ఇద్దరు మాజీమంత్రులకూ స్మగ్లర్లతో సంబంధాలున్న‌ట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలస‌మాచారం. ఇప్పటికే తమిళనాడుకు చెందిన ఓ మాజీ మంత్రిని పోలీసుల అదుపులోకితీసుకున్న‌ట్లు, త్వరలో ఏపీకి చెందిన మాజీ మంత్రిని కూడా అదుపులోకితీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు


తమిళనాడుకు చెందిన ఓ మాజీ మంత్రి దశాబ్దకాలంగా స్మగ్లింగ్ చేస్తున్నాడని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు వాహనాలను ఏర్పాటు చేస్తూ, స్మగ్లింగ్‌కు అవసరమైన పెట్టుబడులు పెడతాడు . విదేశాలకుఎర్ర చందనాన్ని తరలించడానికి అక్కడ ఉన్న డీలర్లల తో తానే స్వ‌యంగామాట్లాడతాడు. పశ్చిమ బెంగాల్‌లోని చిలుగురి ప్రాంతానికి 171 కిలోమీటర్లదూరంలో ఆయనకు ఒక గోడౌన్‌ కూడా ఉంది. విదేశాలకు తరలించడానికి అక్కడసిద్ధంగా ఉంచిన దాదాపు 11 టన్నుల ఎర్ర చందనాన్నిటాస్క్‌ఫోర్స్‌ పోలీసులుఆదివారం రాత్రి దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందినబడా స్మగ్లర్‌ సౌందరరాజన్‌ను అరెస్టు చేశారు. తద్వారా తమిళనాడుకు చెందినమాజీ మంత్రికి, ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధం ఉందని టాస్క్‌ఫోర్స్‌పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.


‘ఏ’ గ్రేడ్‌ ఎర్రచంద‌నం గా గుర్తించారు


స్వాదీనం చేసుకున్న 11 టన్నుల అత్యంత విలువైన, అరుదైన ‘ఏ’ గ్రేడ్‌ ఎర్రచంద‌నం గా గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.22 కోట్లు ఉంటుందనిసమాచారం. మొత్తం ఎర్ర చందనం దుంగలను రోడ్డు మార్గంలో నేపాల్‌, బర్మామీదుగా చైనాకు తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధమయ్యారన్న స‌మాచారంతోపోలీసులు ఈ దాడులు చేశారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌ నుంచి టాస్క్‌ఫోర్స్‌పోలీసులు ఏపీలోని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.మరింత సరుకు దొరికే అవకాశం కూడా ఉందని చెప్పినట్లు తెలిసింది. అక్కడలభించిన 11 టన్నుల ఎర్ర చందనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకుసిద్ధమయ్యారు.


ఎన్‌కౌంటర్లో మరణించిన 20 మంది


ఇటీవల శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన 20 మంది ఎర్ర దొంగలసెల్‌ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారు శేషాచలం అడవుల్లోకి రాకముందు.. వచ్చిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు? వారుఏ ప్రాంతానికి చెందినవారు? వారికి డైరెక్షన్‌ ఇచ్చి అడవిలోకి పంపినవ్యక్తులెవరు? అనే కోణాల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆరా తీశారు. ఈప‌రిశోద‌నలో పోలీసులకు ఎన్నో వాస్తవాలు బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈస్మగ్లింగ్ వెనుక ఏపీ, తమిళనాడులకు చెందిన మాజీ మంత్రుల హస్తం ఉన్నట్లుతేలిపోయింది. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత 20 మంది ఎర్ర దొంగల సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 12 రోజులుగాప్రత్యేక బృందాలు వీటిపైనే ప్రత్యేకంగా దృష్టిసారించాయి. వాటి ఆధారంగాఎట్టకేలకు తమిళనాడుకు చెందిన 16 మంది సూత్రధారులను రెండు రోజుల కిందటఅదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

ఈ స్మగ్లింగ్‌ వెనక ఇద్దరు మాజీమంత్రులే కాక‌, డీఎంకేలోని ఇద్దరు కీలక నేతలు


ఈ స్మగ్లింగ్‌ వెనక ప్రధానంగా తమిళనాడు, ఏపీకి చెందిన ఇద్దరు మాజీమంత్రులే కాక‌, డీఎంకేలోని ఇద్దరు కీలక నేతలు, మాజీ జడ్పీటీసీలు,ఎంపీటీసీలు, డీఎంకేకు చెందిన ఓ కార్పొరేటర్‌ హస్తం కూడా ఉన్నట్లువిచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మాజీజడ్పీటీసీ, వైసీపీకి చెందిన ఓ సర్పంచి, కాంగ్రెస్‌ హయాంలో ఓ వెలుగువెలిగిన.. తిరుపతి, పీలేరు, ఎర్రావారిపాళెం ప్రాంతంలో ఉన్న ఓ ఛోటా ప్రజాప్రతినిధి ప్ర‌ధాన పాత్రధారులుగా వ్యవహరించినట్లు తెలిసింది. వీరు ఇచ్చినసమాచారం ఆధారంగానే పశ్చిమ బెంగాల్‌లోని చిలుగురి ప్రాంతానికి 171కిలోమీటర్ల దూరంలోని ఓ గోడౌన్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు.


16 మంది తమిళ స్మగ్లర్లు ఇచ్చిన వాంగ్మూలం


కాగా, ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ అదుపులో ఉన్న 16 మంది తమిళ స్మగ్లర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మిగిలిన వారిని కూడా త్వరలోనే అదుపులోకితీసుకుని విచారించే అవకాశాలున్నాయి. ఈ వివరాలన్నిటినీ త్వరలోనే పోలీసులుఅధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.స్మగ్లర్ల వెనుక పెద్ద తలకాయల్ని నిజంగా ప్రభుత్వం పట్టుకోలేదా అనే చర్చఉండేది. ఇప్పుడు ఆ తలకాయల దొరికాయి.


ఖ‌చ్చితంగా పెద్ద తలల్ని వదిలేసి చిన్న వాళ్ళని బలి పెట్టడం తప్పే. కానీఒక్క తమిళనాడు నుంచే ఎందుకు ఇలా వందలాది మంది ఒక ఉద్యమంలా వరదలా రోజూతరలి వచ్చి వందల వృక్షాల్ని నరికేస్తున్నారు.. అడవులు కాల్చేస్తున్నారు?దీనికి కార‌ణం ఏమిటన్న‌ది గ‌మ‌నించి.. శాశ్వ‌త ప‌రిష్కారం ఆలోచించి త‌గునిర్ణ‌యం తీసుకొవాలసిన ఆవ‌స‌రం ఏపీ, తమిళనాడు ప్ర‌భుత్వం పైనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: