దేశంలో రోజు రోజుకి  రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరగుతున్నాయి. రోడ్డు రవాణా సంస్థ ఎన్ని ప్రామాణిక చర్యలు చేపట్టినా ఎన్ని కఠిన నియమ నిబంధలు పెట్టినా రోడ్డు పై ప్రమాదాలను అరికట్ట లేక పోతున్నారు. తాజాగా బీహార్ లో ఓ రోడ్డు ప్రమాదంలో అభం శుభం తెలియని ఆరుగురు చిన్నారులు బలైపోయారు. సివాన్ జిల్లాలో విద్యార్థులతో వెళుతున్న ఆటోను, ఎదురు వైపుగా వస్తున్న మినీ బస్సు ఢీకొంది.


చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న దృశ్యం


ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో పదిమందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వారికి సరైన చికిత్స అందించకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బందిపైనా దాడులు చేశారు. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: