తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరని పొలిటికల్ సర్కిల్లో ఓ టాక్ ఉంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.. ఆ పార్టీనేతలు.. ఇతర పార్టీలతో పోలిస్తే.. క్రమశిక్షణగా ఉంటారు. అయితే ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల ఇష్యూ ఇప్పుడు టీడీపీకి కొత్త తలనెప్పులు తెచ్చిపెడుతోంది. 

ఒకే పార్టీకి చెందిన నేతలు.. అదీ అధికార పార్టీకి చెందిన నేతలు బాహాటంగా విమర్శలకు దిగడం ఆ పార్టీ పరువుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పడిప్పుడే పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్న లోకేశ్ పై ఇప్పుడు ఈ ఇష్యూను సాల్వ్ చేసే భారం పడింది. కొత్త నేతకు ఇది మంచి ప్రాక్టికల్ హోంవర్క్ అని కొందరు భావిస్తున్నారు.  

ఇప్పటికే ఈ ఇష్యూపై లోకేశ్ దృష్టిసారించాడట. ఇద్దరకూ రాజీ కుదుర్చాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఓ కొలిక్కిరావడం లేదు. సీఎం రమేశ్, గల్లా జయదేవ్ ఇద్దరూ తమ వాదన అటు చంద్రబాబుకు, లోకేశ్ కు వివరించారట. తాము వెనక్కు తగ్గేదేలేదని స్పష్టం చేశారట. 

మధ్యవర్తి పాత్ర పోషించాల్సిన లోకేశ్ సీఎం రమేశ్ వైపు మొగ్గుతున్నారని తెలిసింది. కానీ అవతల పార్టీ జయదేవ్ కూడా మహా మొండివాడిగా చెబుతారు. లోకేశ్ స్వయంగా గల్లాకు ఫోన్ చేసి వెనక్కి తగ్గాలని చెప్పినా ఆయన ససేమిరా అని చెబుతున్నట్టు సమాచారం. మరి ఈ క్లిష్టమైన సమస్యను పార్టీ పరువు.. తన పరువూ పోకుండా లోకేశ్ ఎలా పరిష్కరిస్తారో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: