తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రులిద్దరికీ ఇప్పుడు సంధికాలం వచ్చేసింది. ఇన్నాళ్లూ పార్టీలను అజమాయిషీ చేస్తూ వస్తున్న చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్ రావులకు వయసైపోతోంది. బాబు మొన్ననే లేటెస్టుగా 65వ ఏట అడుగు పెట్టేశాడు. రాజకీయాల్లో అదేమంత  ఎక్కువ వయసు కాకపోయినా భవిష్యత్తు గురించి ఆలోచించ తప్పని సమయం వచ్చేసినట్టే..

ఈ ఇద్దరు చంద్రులకూ ముందుచూపు కాస్త ఎక్కువే. అందుకే వారు తమ వారసులను ఇప్పటికే రెడీ చేసి ఉంచేశారు. చంద్రబాబు రెండేళ్ల నుంచి లోకేశ్ ను ఫుల్ టైమర్ గా మార్చి.. పార్టీ పనులకు అలవాటు చేస్తున్నారు. అయినా ఇంకా లోకేశ్ కు ఇండిపెండెంట్ గా వ్యవహరించేంత సీన్ వచ్చినట్టు కనిపించడం లేదు. 


ఇక రిటైర్ అవుతారా..?


అటు కేసీఆర్ తనయుడు ఇప్పటికే ఎమ్మెల్యేగా పలుసార్లు ఎన్నికై.. ఈసారి ఏకంగా మంత్రి పదవే అలంకరించాడు. లోకేశ్ తో పోలిస్తే కేటీఆర్ చాలా బెటరేనని చెప్పుకోవచ్చు. అయినా సరే.. టీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ కు అప్పగించేందుకు కేసీఆర్ ఇంకా జంకుతూనే ఉన్నారు. కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తే.. హరీశ్ రావు తిరుగుబాటు చేస్తాడన్న భయమే ఇందుకు కారణమని చెప్పుకుంటుంటారు. 

పార్టీ పనుల నుంచి విశ్రాంతి..


ఇటు చంద్రబాబు కూడా పార్టీ పగ్గాలు లోకేశ్ కు అప్పగిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. కానీ కాస్తో కూస్తో మాటకారి, ఉద్యమనాయకుడిగా వ్యవహరించిన కేటీఆర్ కే పగ్గాలు ఇచ్చేందుకు కేసీఆర్ వెనకడుగు వేసేశారు. మరోసారి కేసీఆరే టీఆర్ఎస్ పగ్గాలు చేపడుతున్నారు. అలాంటిది చంద్రబాబు ఆ సాహసం చేస్తారా.. ఆలోచించాల్సిన విషయమే. 

వారసులకు పగ్గాలు దక్కేనా..?



మరింత సమాచారం తెలుసుకోండి: