అగ్ర‌రాజ్యం అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడుల ప‌ర్వం కొన‌సాగుతునే ఉంది.గ‌తంలో అమెరికాలోని సియాటెల్ ప్రాంతంలోని అతిపెద్ద ఆలయంపై దాడికిపాల్పడ్డారు. తాజాగా ఉత్తర టెక్సాస్ లోని ఓల్డ్ లేక్ హైల్యాండ్స్ లోకొలువై ఉన్నహిందూ దేవాలయంపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో దుండగులు దేవాలయంపై దాడిచేయడమే కాకుండా అసభ్యకరమైన ఫోటోలను అతికించారు.

విద్వేష దాడి 


అమెరికాలోని వ‌రుస‌గా హిందు దేవాలయంపై విద్వేష దాడి జరగడం పై వివాదం మొదలైంది. సియాటెల్ ప్రాంతంలోని అతిపెద్ద ఆలయంపై దాడికి పాల్పడినదుండగులు ఆ టెంపుల్ గోడపై అనుచిత వ్యాఖ్యలు రాశారు. ఆలయం గోడపై స్వస్తిక్గుర్తు తో పాటు ' గెట్ అవుట్' అన్న రాతలు కనిపించాయి. ఈ తరహా సంఘటననిజంగా బాధాకరమని, ఉత్తర టెక్సాస్ లోని ఓల్డ్ లేక్ హైల్యాండ్స్ దేవాలయబోర్డులో పని చేస్తున్న కృష్ణ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మొత్తం ఒకజాతినే అవమానపరిచే చర్యగా ఆయన అభివర్ణించారు.


అమెరికాలో హిందూ ప్రార్థనా స్థలాలపై దాడుల పరంప‌ర కొన‌సాగుతునే ఉన్నాయి.గత సంవత్సరం ఆగస్టులో జార్జియాలోని విశ్వ భవన్ హిందూ మందిర్ లోని శివుడివిగ్రహానికి నల్లరంగు పూశారు. మన్రో లోని ఆలయానికి వెళ్ళే ఫోన్ లైన్ నుకట్ చేశారు. ఆలయంపై విద్వేషపూరిత కామెంట్స్ రాశారు. జూలై అక్టోబర్కాలంలో వర్జీనియా రాష్ట్రంలోని లౌడన్ కౌంటీ పోలీసులు పదిహేడు హిందూవిద్వేష ఘటనలు నమోదు చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో ఇలాంటి హిందూ వ్యతిరేకఘటనలను విద్వేష పూరిత నేరాలుగా (హేట్ క్రైమ్స్) పరిగణించాలని అమెరికాజస్టిస్ విభాగం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.


అధ్యక్షుడు బరాక్ ఒబామా


ఇటీవల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానిస్తూ.. మహాత్మా గాంధీబతికుంటే.. భారతదేశంలో ప్రస్తుతమున్న పరమత అసహనాన్ని చూసి దిగ్భ్రాంతికిగురయ్యేవారని అన్నారు. ఈ నేపథ్యంలో.. అమెరికాలోని దేవాలయంపై ఇటువంటిదాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిపబ్లిక్ డేకార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన‌ ఒబామా, భారత్ నుంచి వెళ్తూ వెళ్తూమైనారిటీ మతాల హక్కులను కాపాడాలని హితబోధ చేసి వెళ్లారు. ఆయన సందేశానికికొనసాగింపు అన్నట్లుగా ఇప్పుడు ఆయన పాలన‌లోనే.. ఇక్కడి చర్చిలపై దాడికిప్రతి చర్యగా అమెరికా నేలపై హిందు దేవాలయంపై దాడులు చోటుచేసుకుంటున్నాయి .


‘హిందు అమెరికన్ ఫౌండేషన్’


వాస్త‌వానికి దాడి అంటే ధ్వంసం చేయడం, కొట్టడం, కాల్చడం లాంటివి ఏమీజరగలేదు. కానీ, ఆలయ గోడలపై స్వస్తిక్ గుర్తును స్ప్రే పెయింట్ చేశారు.పెద్ద అక్షరాలలో ‘GET OUT’ అనే అక్షరాలు వచ్చేలా స్ప్రే చేశారు.అమెరికాలో పని చేసే ‘హిందు అమెరికన్ ఫౌండేషన్’ సంస్ధ నేతలు ఘటననుతీవ్రంగా ఖండించారు. ఘటన జరిగిన బోతేల్ ఆలయం ‘హిందూ టెంపుల్ అండ్ కల్చరల్సెంటర్’ ట్రస్టీ ఛైర్మన్ నిత్యా నిరంజన్ ఈ చర్యల పై స్పందించాడు.అమెరికాలో ఇలాంటిది అసలు జరగనే కూడదని.. గెట్ ఔట్ అనటానికి అసలుమీరెవరంటూ ప్రశ్నించారు. ఇది వలస ప్రజల దేశమని నిరంజన్ స్పష్టం చేశారు.


ప్రార్ధనా స్ధలాలు ప్రజలు భద్రంగా, శాంతిగా ఉండవలసిన ప్రదేశాలని.. పరులకుసేవ చేసేందుకు స్ఫూర్తిని ఇవ్వాల్సిన చోట్లని హెచ్ఎఎఫ్ బోర్డు సంస్థతెలిపింది. దానికి బదులు గత కొద్ది రోజుల్లోనే సియాటిల్ లో హిందూ ఆలయంపైదాడి, బోస్టన్ లో మసీదు విధ్వంసం జరగడంతో వివిధ కమ్యూనిటీల ప్రజల మధ్యఅపనమ్మకం పెరగడానికి, భయాందోళనలు రెచ్చగొట్టడానికి కారణం అయ్యాయనిహెచ్ఏఎఫ్ బోర్డు సభ్యులు అన్నారని గ‌తంలో ది హిందు ప‌త్రిక‌లోప్ర‌చురించింది.


కాగా, ఆ దుండుగుల కోసం డల్లాస్ పోలీసులు, డిటెక్టివ్ ఏజెన్సీలతో కలిసిగాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇంత‌వ‌ర‌కు దీనికి కార‌ణం ఎవరో ఇంకాగుర్తించక‌పోవ‌డం గమ‌నార్హం. గత కొన్ని సంవ‌త్ప‌రాలుగా వరుస‌గా హిందుదేవాలయంపై దాడులు జరుగుతున్నే ఉన్నా అమెరికా ప్ర‌భుత్వం మాత్రం చూసిచుడ‌న‌ట్లు గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌వాస భార‌తీయులు అగ్ర రాజ్యం తీరుపై మండి పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: