మనిషి బయటకు వెళితే ఇంటికి క్షేమంగా వస్తాడా..రాడా అన్న గడ్డు పరిస్థతిలో ఇప్పడు ఉన్నారు. ఎటు నుంచి ప్రమాదాలు ముంచుకొస్తాయో ఎవరికీ తెలియదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.   ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగడంతో బస్సులోని 9మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన అమేథీ జిల్లాలోని పీపరాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.  


బస్సలో మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది

Representational image. PTI

మంగళవారం ఉదయం 42 మంది ప్రయాణికులతో బస్సు సుల్తాన్ పూర్ వెళుతుండగా అనుకోకుండా ఈ ప్రమాదం జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. రాంగాన్ గ్రామ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు చెప్పారు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. కొందరు బస్సు అద్దాలు పగులగొట్టి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. మిగిలిన కొంతమంది గాయాలతో బయట పడ్డారు. తొమ్మిది మంది మటుకు బస్సులోనే బూడిదైపోయారు.   దుర్ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తచ్చారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సుల్తాన్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: