తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కనులు మిరుమిట్లు గొలిపే వరాలు కురిపించడంలో దిట్ట. ఈ విషయంలో ఆయనను మించిన వారు లేరు. అలాంటి వాటిలో ఒకటి.. ఆయన రెండున్నర వేల ఎకరాల్లో తెలుగు సినిమాలు మరియు టీవీ రంగం కోసం ఫిలిం సిటీ నిర్మించడం అనే ప్రకటన కూడా. అయితే తాజాగా అందుతున్న సంకేతాలను బట్టి చూస్తోంటే కేసీఆర్ ఫిలిం సిటీ ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించేసినట్లే కనిపిస్తోంది. ఏదో అది చేస్తానని ప్రకటించిన కొత్తలో హెలికాప్టర్ అధిరోహించి.. నల్గొండ జిల్లా పరిదిలోకి వచ్చే కొండలను గుట్టలను పరిశీలించి వచ్చేసిన తర్వాత.. పైగా రామోజీ ఫిలిం సిటీ ని సందర్శించి వచ్చిన తర్వాత.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తాను కానుకగా ఇస్తానని చెప్పిన ఫిలిం సిటీ గురించి మాట్లాడడం కేసీఆర్ ఇంచుమించుగా మానేశారు. పైగా తాజా సంకేతాలు కూడా కొన్ని.. ఈ ప్రాజెక్టు పూర్తిగా మిథ్యగాను మాయగాను తేలిపోతున్నది.


కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి


కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తరువాత.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు బాధ్యులు సహజంగానే ఆయనను వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.  నేపథ్యంలో... హైదరాబాదులో ఫిలిం మరియు టీవీ నిర్మాణ రంగం మరింత వేళ్లేనుకొలేలా.. రెండున్నర వేల ఎకరాలకు పైగా స్థలంలో భారీ ఫిలిం సిటీని నిర్మిస్తానని కేసీఆర్ చాలా ఘనంగా హామీ ఇచ్చేశారు. తెలుగు సినీ సీనియర్లలో ప్రముఖుడు ఘట్టమనేని క్రిష్ణ అయితే.. ఒక అడుగు ముందుకేసి.. సదరు ఫిలింసిటీకి.. కేసీఆర్ పేరు పెట్టాలని కూడా ప్రతిపాదించి... సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు తపన పడ్డారు. ఆ తరువాత ఆయన హెలికాప్టర్ లో కొండలు గుట్టలను పరిశీలించి రావడం జరిగింది. అలాగే... ఆ తరువాత.. రామోజీరావు ఫిలింసిటీని కూడా ఆయన సందర్శించారు.. ఆ వెంటనే రామోజీరావును అతి భయంకరంగా కీర్తించారు.  ఆ తర్వాత క్రమంగా ప్రభుత్వం నిర్మిస్తానన్న ఫిలింసిటీ మాట ఎక్కడా వినిపించడం లేదు.

కేసీఆర్ ను రాజేంద్రప్రసాద్ వెళ్లి కలిశారు


అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటుల సంఘం మా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన గద్దె రాజేంద్రప్రసాద్ వెళ్లి కలిశారు. సాధారణం ఏ రంగానికి చెందిన వారు వచ్చి సీఎంను కలిసినా.. వారి వారి రంగాలకు సంబంధించి ప్రభుత్వం రాబోయే కాలంలో ఏం చేయబోతున్నదనే విషయంలో కొన్ని హామీలను ఇస్తుండడం సహజం. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నామమాత్రం కూడా.. ఫిలిం సిటీ గురించి రాజేంద్రప్రసాద్ తో చెప్పలేదని సమాచారం. తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు అందరితోనూ త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఉన్నదని మాత్రం కేసార్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తెలుగు పరిశ్రమకు సంబంధించి వారికి ప్రభుత్వ పరంగా  సాయం అందించాలనే విషయాన్ని తెలుసుకోవడానికి సంబంధించి... ఇలాంటి సమావేశాలు కేసీఆర్ గతంలో చాలానే నిర్వహించారు... అయితే ఏవి ఎంతమాత్రం ఫలితం ఇచ్చాయనే సంగతి మనం చూస్తూనే ఉన్నాం. మళ్లీ ఆయన పరిశ్రమ వారితో ఓ సమావేశం పెట్టడం గురించే మాట్లాడుతున్నారు. ఇలా ముఖప్రీతి కోసం ప్రకటించే సమావేశాలు ఆరునెలలు గడచిన కార్యరూపం దాల్చవని పలువురు పెదవి విరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: