ఏరు దాటే వరకు ఓడ  మల్లన్న.. దాటిన తర్వాత బోడ మల్లన్న అన్న చందంగా ఉంది బాబు పరిపాలన వైఖరి. ఈ మాట అంటుంది ఎవరో కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పద్మ.  ఎన్నకల సమయంలో ఓట్లు అడిగేందుకు వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. తీరా పరిపాలన చేతికి వచ్చిన తర్వాత వాటి ఊసే మరిచారు అంటూ చంద్రబాబుపై పద్మ ధ్వజమెత్తారు. అంతే కాదు  అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేసిన మొదటి ఐదు సంతకాల విషయం ఏమైందని ఆమె అడిగారు. మద్యం వ్యాపారం చేయాలని అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచనలు దుర్మార్గమని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ


ఎన్నికలకు ముందు మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడెందుకు మాట మార్చారని ఆమె అడిగారు. బెల్టు షాపులను రద్దు చేస్తున్నట్లు జీవో ఇచ్చారని, అయితే ఇప్పటికీ ఒక్క బెల్టు షాపు కూడా రద్దు కాలేదని పద్మ అన్నారు.  ఇప్పుడు  గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని అంతే కాదు దగ్గరుండి మరీ ప్రభుత్వం దీన్ని ప్రోత్సహింస్తుందని  ప్రభుత్వమే సమీక్షలు నర్వహించి మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం అత్యంత దారుణమని ఆమె అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత బెల్టు షాపులు అన్న పదమే మర్చిపోయారని ఆమె అన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారికి క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: