సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ హైదరాబాద్ వచ్చినపుడు మంచు మోహన్ బాబు ఆయను కలిసి తన సంఘీబావం వ్యక్తం చేశాడు. అంతే కాదు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసి సమావేశం అయ్యారు. అప్పటి నుంచి మోడీ, మోహన్ బాబుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మోడీ పాలన షెబాష్ అంటూ మోహన్ బాబు ఖితాబు కూడా ఇచ్చాడు.


తన పెళ్లిపత్రిక ఇస్తూ మోడిని ఆహ్వానిస్తున్న మంచు మనోజ్ పక్కనే మంచు లక్ష్మి


ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టాలీవుడ్ నటుడు డాక్టర్ మోహన్ బాబు, ఆయన కుమార్తె, కుమారులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా  మంచు మనోజ్ కుమార్ వివాహా ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా మంచు మనోజ్  ప్రధాని మోడీ తనను రాజకీయాల్లోకి రమ్మని అడిగారు, నేను ఆలోచించి చెబుతానను అన్నాను  అంటూ వ్యాఖ్యానించిన మంచు మనోజ్, వెంటనే ఓ నవ్వు నవ్వి జస్ట్ జోక్ చేసాను అంటూ మీడియాకు షాకిచ్చారు. మోడీని కలవడం వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆయన గొప్ప నేత మేం కలవాలని అడిగిన వెంటనే సాదరంగా ఆహ్వానించారు.


మోడీ ని కలిసిన మంచు విష్ణు


ఇదే సందర్భంగా నా పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చాను చూసి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఇటీవలే మనోజ్ నిశ్చితార్థం ప్రణతి రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 4, ఉదయం 10.30 గంటలకు ఎంగేజ్మెంట్ జరిగింది. మనోజ్-ప్రణతి వివాహానికి పురోహితులు మే 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. మరో విశేషం ఏంటంటే మనోజ్ పుట్టిన రోజు కూడా మే 20వ తేదీయే. ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: