అద్భుతం అనదగిన అందాలను ఏదో ఊచల్లోంచి చూడడానికి... మధ్యలో ఎలాంటి అడ్డుతెరలు, అడ్డుపొరలు లేకుండా నిండుగా చూడడానికి తేడా ఉంటుంది కదా. అవును అనాచ్ఛాదితంగా లభించే అందాలే అందాలు. అలాంటి వాటిని చూడడం అనేది కనుల పండుగే.. అందుకే రైల్వే శాఖ వారు ఒక ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ అంటే ప్రక్రుతి రమణీయతకు అనువైన ఎన్నో అద్భుతమైన స్థలాలు ఇక్కడ మనకు ఉన్నాయి. ప్రధానంగా పాపికొండలు, అరకు రమణీయ అందాలు, కోనసీమ అందాలు ఈ కోవలోకి వస్తాయి.  ఇందులో ఎక్కువగా పర్యాటకుల తాకిడి ఉండేది... అరకు అందాలకే. అందుకే వీటికి ఆదరణ మరింత పెంచడానికి ఢిల్లీ ప్రభుత్వం లెవెల్లో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.


అరకు అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి


రాష్ట్రం వదలి వెళ్లకుండా.. ఏపీలో మాత్రమే షూటింగులు తీయాలంటే.. గనుక.. పాట అనగానే.. ప్రతి వారూ  అరకుకు వెళ్లిపోతుంటారు. మనకు బోలెడు సినిమాల్లో అరకు అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి. కాకపోతే.. విశాఖ నుంచి అరకు వరకు ప్రయాణం చేసిన వారు మాత్రం రోడ్డు మార్గంలో వెళ్లడం కంటె రైలు మార్గంలో వెళ్లడంలోనే ఓ అద్భుతమైన అనుభూతి ఉంటుందని చెబుతుంటారు. రైలు మార్గంలో వెళుతున్నప్పుడు ప్రక్రుతి అందాల కనువిందేనని అభివర్ణిస్తుంటారు. ఇలాంటి సౌందర్యారాధకులకోసం.. రైల్వేశాఖ వారు.... అద్దాల బోగీలను అరకు వరకు వెళ్లే రైలుకు తగిలించాలని యోచిస్తున్నారుట. రైలు బయట ఎంత బీభత్సమైన అందాలు ఉన్నప్పటికీ.. వాటిని బోగీకి ఉండే ఊచల కిటికీల్లోంచి చూడడం మాత్రమే ఇప్పటిదాకా రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండేది. అలాంటిది ఇప్పుడు వారికి రెండు వైపులా కేవలం అద్దాలు మాత్రమే బిగించి ఉండే బోగీలు ఏర్పాటు చేస్తారుట.


 విశాఖ నుంచి అరకు వరకు ప్రయాణం


వీటి ద్వారా... విశాఖ నుంచి అరకు వరకు ప్రయాణం చేస్తున్నంత సేపూ అడుగడుగునా తారసిల్లే అందాలను అణువణువూ విడిచిపెట్టకుండా ఆస్వాదించవచ్చునన్నమాట. మరి ఈ అద్దాల బోగీలు ఆచరణలోకి వస్తే అద్భుతో అద్భుత: అనకుండా ఉండగలమా? కాకపోతే.. అరకు వెళ్లే రైలు మొత్తం కాకుండా.. రెండు బోగీలు మాత్రమే ఇలా కంప్లీట్ అద్దాలతో ఉంటాయిట. వీటికి ప్రత్యేక టిక్కెట్ రూపంలో ఎంత వడ్డిస్తారో ఏమో?


జెటిల్ మేన్  సినిమాలో చికు బుకు చికు బుకు రైలే


మీకో సంగతి గుర్తుందా... జెటిల్ మేన్  సినిమాలో చికు బుకు చికు బుకు రైలే అంటూ ఓ పాట సాగుతుంది. సినిమా మేకింగ్ లో భారీతనానికి తనదంటూ ఒక ముద్ర కలిగి ఉన్న దర్శకుడు శంకర్ ఈ పాటలో.. పూర్తిగా అద్దాలతో బాడీబిల్డింగ్ చేసిన ఓ బస్సును వాడారు. ఆ బస్సులో షూట్ చేసిన పాట.. అప్పట్లో ఓ సంచనలం. ఇప్పుడు అద్దాల బోగీ కూడా.. ఇంచుమించు అదే రేంజిలో ప్రజలను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: