ఎర్రచందనం దొంగల వ్యవహారంలో ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి. చందనం స్మగ్లింగ్ తో కోట్లకు కోట్లు వెనకేసిన స్మగ్లర్లు.. ఆ సొమ్మును గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా రంగంలో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ సినీరంగాల్లో స్మగ్లర్ల హస్తం ఉన్నట్టు క్రమంగా వెల్లడవుతోంది. 

సినీరంగం అంటనే గ్లామర్ ఫీల్డ్.. స్మగ్లర్ల లాంటి క్రిమినల్స్ కు ఇక్కడ ప్రధాన ఆకర్షణ హీరోయిన్ల అందాలే అన్న సంగతి బహిరంగ రహస్యమే.. డబ్బుకు కొదువ లేని స్మగ్లర్లు.. సినీతారలతో విచ్చలవిడిగా వ్యవహరించినట్టు పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడవుతోంది. హీరోయిన్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చి వల్లో వేసుకోవడం, హీరోలతోనూ టచ్ లో ఉండటం చేశారట. 

కొందరు స్మగ్లర్లు నిర్మాతల అవతారం ఎత్తితే.. మరికొందరు స్మగ్లర్లు ఫైనాన్షియర్లుగా మారారు. ఇంకొందరు బినామీల పేరుతో సినీఫీల్డ్ లో కొనసాగారట. లేటెస్టుగా తమిళనాడులో చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేసిన శరవణన్.. ఓ తమిళ సినిమాలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. ఇప్పటికే వైకాపాకు చెందిన నేత మస్తాన్ వలీ ఓ సినిమా తీసినట్టు.. ఓ హీరోయిన్ తో సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చేశాయి. 

స్మగ్లింగ్ సొమ్ముకు లెక్కలు సృష్టించడం కోసం స్మగ్లర్లు సినీఫీల్డును వాడుకున్నారట. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు వారికి ఈ సినిమా  ఓ సాధనమైందని పోలీసులు చెబుతున్నారు. త్వరలోనే ఈ గుట్టును రట్టు చేస్తామంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: