ఎర్రచందనం స్కామ్ వ్యవహారం తెలుగు రాజకీయాలను ఓ కుదుపు కుదిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చందనం వ్యవహారంలో ఏపీకి చెందిన ఓ మాజీ మంత్రికి లింకులున్నాయని ఇప్పటికే మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఆ మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. 

ఐతే.. ఈ చందనం స్కామ్ లో ప్రస్తుత ఎమ్మెల్యేలకు చాలా మందికి లింకులు ఉన్నాయని సాక్షాత్తూ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వయంగా వెల్లడించడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. చందనం కేసుల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది నేతలు టీడీపీ చేరేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే.. ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని బొజ్జల చెప్పేశారు. 

మంత్రి బొజ్జల చెబుతున్న దాని ప్రకారం ఆలోచిస్తే.. రాయలసీమకు చెందిన చాలామంది ఎమ్మెల్యేలకు చందనం వ్యవహారంలో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అందులనూ.. వాళ్లు ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలే అయి ఉండొచ్చని అనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలపై చందనం ఆరోపణలు ఉన్నాయి. ఓ ఎంపీపీని అరెస్టు కూడా చేశారు. 

చందనం స్మగ్లర్ గంగిరెడ్డితో జగన్ కు లింకులున్నాయని కూడా పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు చందనం లింకులు ఉన్నట్టు తేలితే.. రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ఇప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల ట్రాక్ రికార్డు అంత బాగా లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: