వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి ఇన్ని సంవత్సరాలైనా.. టీడీపీ మాత్రం ఆయన్ను వదిలిపెట్టేలా లేదు. జనం క్రమంగా వైఎస్ గురించి మరచిపోతున్నా.. ఎప్పుడో ఓసారి టీడీపీ నేతలే ఆయన్ను గుర్తు చేస్తున్నారు. వైసీపీ నేతల కంటే ఎక్కువగా టీడీపీ నేతలే వైఎస్ ను తలచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. వైఎస్, జగన్ ల  అక్రమాల గురించి నిత్యం వల్లె వేసేవారిలో మంత్రి రావెల కిషోర్ ముందువరుసలో ఉంటారు.


విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆదివాసీల ఆత్మగౌరవసభలోనూ ఆయన వైఎస్ ను విమర్శించేందుకే ప్రాధాన్యమిచ్చారు. వైఎస్ ను గజదొంగతో పోలుస్తూ పిట్టకథ చెప్పారు.ఓ గజదొంగ ఓ రాత్రి ఊరి మొత్తాన్ని దోచుకున్నాడట. వెళ్లూ వెళ్తూ.. ఓ ముసలాయన దగ్గరున్న కొద్ది మొత్తం కూడా దోచుకున్నాడట. ఆ తర్వాత ఆ ముసలాయ ఒంటిపైనున్న బట్టలు కూడా దోచుకున్నాడట.  ఆ తర్వాత.. తనను గుర్తు చేసుకునేవాళ్లు ఉండరని.. వెనక్కి వచ్చి ముసలాయన బట్టలు ఆయనకే ఇచ్చేశాడట. 


దాంతో ఆ ముసలాయన చాలా సంతోషపడిపోయి.. గజదొంగ చాలా మంచి వాడని మెచ్చుకున్నాడట. వైఎస్ విషయంలోనూ బడుగు బలహీన వర్గాల వారు ముసలాయన లాగే వ్యవహరిస్తున్నాడని చెప్పుకొచ్చారు. గజదొంగలా వైఎస్ చోసిన అసలు దోపిడీని మరచిపోయి.. చివర్లో చేసిన ఉపకారాన్నే గుర్తుపెట్టుకుని దేవుడంటున్నారని విమర్శించారు. 


గొర్రెలిచ్చారనో, బర్రెలిచ్చారనో ఆదివాసీలు ఓట్లు వేయడం వల్లే వైఎస్ లాంటి వాళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని మంత్రి రావెల కిషోర్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఊరును దోచుకోవడానికి వచ్చిన దొంగ ఊరిబయట ఉన్న పేదల వస్తువులు దోచుకుని తిరిగివ్వడం లాగే వైఎస్ దోపిడీ కొనసాగిందని రావెల ఉదహరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: