భూసేకర బిల్లుపై ఆందోళన చేపట్టి జంతర్ మంతర్ నుంచి ర్యాలీ కొనసాగించే సమయంలో కేజ్రీవాల్ రైతులనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. 41 ఏళ్ల గజేంద్ర అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన జరిగిన రెండు రోజులు తర్వాత ఆయన స్పందించారు. ఆ దుర్ఘటన తర్వాత నేను ప్రసంగించకుండా ఉండాల్సింది. ఎవర్నయినా బాధపెట్టి వుండే నా మన్నించండన్నారు.


చెట్టుకు ఉరి వేసుకున్న గజేంద్ర


అనుకోని పరిణామం ఇది దీనికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా అన్నారు. కాగా ర్యాలీ సందర్భంగా గజేంద్ర ఒక చెట్టుకు ఉరి వేసుకున్నారు. అది గమనించిన ఆప్ కార్యకర్తలు, పోలీసులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికీ పది నిముషాలు కేజ్రీవాల్ ప్రసంగాన్ని కొనసాగించారు.


ర్యాలీ సమయంలో ప్రసంగిస్తున్న కేజ్రీవాల్


గజేంద్రను రక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ప్రతిపక్షాలు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పార్లమెంట్ లో గందరగోళం కూడా చెలరేగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్ అందరికీ క్షమాపన చెప్పారు. అయినప్పటకీ ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: