విశాఖ జిల్లాలో రాజకీయాలు మహా రసవత్తరంగా ఉంటాయి. ఇక్కడ నేతలు ఎప్పుడూ వివాదాస్ప అంశాల్లో ఎక్కువగా ఉంటారు. అది టీడీపీ,కాంగ్రెస్,వైఎస్సార్ సీపీ ఏ పార్టీ  అయినా కావొచ్చు.   ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలు గత రెండు రోజుల నుంచి తెలుగు దేశంపై విమర్శలు గుప్పిస్తున్న  విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ  ఎన్నికలలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీపై ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేరుస్తామని తెలిపారు.



అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి అయ్యన్న పాత్రుడు


ఇక  వైఎస్సార్ కాంగ్రెస్ నగరి ఎమ్మెల్యే, నటి రోజాపై ధ్వజమెత్తిన అయ్యన్న ఆమెది ఐరెన్ లెగ్ అంటూ విమర్శించారు. రోజా వంటి ఐరెన్ లెగ్ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఇక ఎన్నికలలో గెలవలేదని ఎద్దేవా చేశారు. అలాగే మహిళ అయినప్పటికీ నోటితో చెప్పలేని అసభ్య పదజాలాన్ని రోజా ఉపయోగిస్తున్నారని, ఇప్పటికే ఐరెన్ లెగ్ అన్న పేరు ఉన్న రోజా వైఎస్సార్ కాంగ్రెస్ లోకి అడుగుపెట్టి ఆ పార్టీ పరాజయానికి కారణం అయ్యారని అయ్యన్న పేర్కొన్నారు. ఇక తమ పార్టీ సీటు ఇచ్చినా గెలవలేని రోజాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అనే హక్కు లేదని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: