గత పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన వార్త  బర్డ్ ప్లూ. దీంతో లక్షల్లో కోళ్ల ప్రాణాలు గాళ్లో కలిసిపోయాయి. అంతే కాదు కోళ్ల ఫారాలు దివాలా తీశాయి. వ్యాపారస్తులు కూడా దివాలా తీశారు. కానీ ఇప్పుడు  బర్డ్ ప్లూ ప్రభావం తగ్గిపోయిందని నిరభ్యంతరంగా చికెన్ తినొచ్చు అని ప్రభుత్వమే తెలియజేస్తుంది. అంతే కాదు వినూత్న ప్రచారాలు కూడా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ అండ్ ఎగ్ మేళాలను నిర్వహిస్తున్నామని అన్నారు.


చికెన్ మేళాలో చికెన్ తింటున్న మంత్రులు


శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో కూడా చికెన్ వంటకాలనే తయారు చేపిస్తున్నామని, దీనిని ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు. చికెన్ అండ్ ఎగ్ మేళాలో ఈటెల్ రాజేందర్‌తో పాటు మరో మంత్రి టి. పద్మారావు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చికెన్ తింటే బర్డ్ ప్లూ వస్తోందని అనేక వదంతులు వస్తున్నాయని, అలాంటి వదంతులను నమ్మద్దని సూచించారు. ఎలాంటి భయం లేకుండా చికెన్ తినచ్చని అన్నారు. ఈ సందర్భంగా చికెన్ తో తయారుచేసిన వంటకాలను, గుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట వ్యాప్తంగా ఇలాంటి చికెన్ అండ్ ఎగ్ మేళాలు నిర్వహిస్తామని, శుక్రవారం ప్లీనరీ సమావేశంలో కూడా చికెన్ తోనే వంటకాలు తయారుచేయిస్తామని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: