బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వీరోచితమై మరణం పొందిన భారతీయు రాజు  టిప్పూ సుల్తాన్. ఈయన పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలి టిప్పు.  మైసూరు పులిగా ప్రశిద్ది గాంచినవాడు. హైదర్ అలీ అతని రెండవ భార్య ఫాతిమ లేక ఫక్రున్నీసాల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది, మతసామరస్యం పాటిస్తూ ఇతర మతాలను, మతాచారాలను గౌరవించెడివాడు. ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చి నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది.

టిప్పూ సుల్తాన్ సమాధి


బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. 1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి బ్రిటీషువారినీ ఓడించాడు. తండ్రి హైదర్ అలీ అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి రెండో మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందము తో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి సల్తనత్ ఎ ఖుదాదాద్ అని పేరు. మూడవ మైసూరు యుద్ధం మరియు నాలుగవ మైసూరు యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, 1799న శ్రీరంగపట్నను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.


టిప్పూ సుల్తాన్ వాడిన ఉంగరం


మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గాన్ని భారీ ధరకు విక్రయించారు. పులి తల బొమ్మతో కూడిన పిడి, వజ్రాలు, రత్నాలు పొదిగిన ఈ ఖడ్గాన్ని దక్కించుకునేందుకు ఓ ఔత్సాహికుడు ఏకంగా రూ.20 కోట్లను వెచ్చించాడు. గురువారం లండన్‌లో జరిగిన వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గంతో పాటు ఆయన వాడిన 30 రకాల ఆయుధాలను ‘బోన్ హామ్స్’ విక్రయించేసింది. టిప్పు సుల్తాన్ కత్తికి రూ.20.49 కోట్లు రాగా, మిగిలిన ఆయుధాలకు రూ.37 కోట్లు వచ్చాయట. వేలం ప్రారంభానికి ముందు టిప్పు సుల్తాన్ కత్తికి రూ.10 కోట్లు రావచ్చని బోన్ హామ్స్ సంస్థ అంచనా వేసింది. అయితే, ఆ సంస్థ అంచనాలను పటాపంచలు చేస్తూ టిప్పు సుల్తాన్ ఆయుధాలు ఆ సంస్థకు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని బోన్ హామ్స్ అధికారులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: