గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజదానికి కోసం భూసేకరణ పెద్ద సమస్యగా మారింది. దీనిపై రాజకీయ సంక్షోభం ఏర్పడింది. రైతులు మొదట ఓకే  అన్నా తర్వాత వ్యతిరేకించారు. దీనికి తోడు ప్రతిపక్షం వారు కూడా రైతులకు తోడయ్యారు. అంతే కాదు ఆ మధ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఏది ఏమైనా రైతులు దీనిపై పోరాటం చేస్తూ లాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ సుమారు 600 మంది రైతులు హైకోర్టుకు వెళ్లారు.


రాజధాని కోసం సూచించిన మ్యాప్


దీనిపై వారి పొలాలను లాండ్ పూలింగ్ నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.  ప్రభుత్వమే తీసుకువచ్చిన చట్టాన్ని ప్రభుత్వమే అమలు చేయకపోవడం ఎలా అని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం.కోర్టుకు వచ్చిన రైతులు వ్యవసాయం చేసుకోవచ్చని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.రైతుల పక్షాన పి.సుధాకరరెడ్డి వాదించారు.అయితే మరి వీరిపై భూ సేకరణ చట్టాన్ని ఎపి ప్రభుత్వం ప్రయోగిస్తామని హెచ్చరించింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: