ఆంధ్రాకు ప్రత్యేక హోదా నిరాకరించడంపై కేంద్రానికి స్పష్టత ఉంది. ఆ విషయమే ఇన్ డైరెక్టుగా ఏకంగా పార్లమెంటులోనే  చెప్పేసింది. కేంద్రం స్పందనపై ఏపీ జనం మండిపడుతున్నారు. అంతటా ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. విషయం ఇంత క్లారిటీగా ఉన్నా చంద్రబాబు రియాక్షన్ మాత్రం విచిత్రంగా ఉంది.  

రాష్ట్రానికి మోదీ ఇంకా ప్రత్యేక హోదా ఇంకా ఇస్తారనే చంద్రబాబు నమ్ముతున్నట్టు కనిపిస్తున్నారు. బహుశా ఆయనకూ నమ్మకం లేకపోయినా బయటకు ధైర్యం నటిస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిరంతర సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబుచెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో కేంద్రం ఇచ్చిన సమాధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచితూచి స్పందించారు. 

ఇంద్రజిత్ సింగ్ ప్రకటనపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకూ, అధికారులకు సూచించారట. అసలేం జరిగిందో స్పష్టంగా తెలుసుకొమ్మని వారికి పురమాయించారట. ప్రత్యేక హోదా గురించి తనకు ఢిల్లీ పర్యటనలో అరుణ్ జైట్లీ మీడియా ముఖంగా హామీ ఇచ్చారని చంద్రబాబు అంటున్నారట. 

ప్రత్యేక హోదాతో పాటు ఇతర డిమాండ్లయిన ఆర్థికలోటు నిధులు, రాజధాని నిధులు, పోలవరం నిధులు.. ఇలా వీటిని రాబట్టుకునేందుకు నిరంతరం ఒత్తిడి తేవడమొక్కటే పరిష్కారమని చంద్రబాబు నేతలకు సూచించారు. పాపం అంతకు మించే చంద్రబాబు ఏం చేయడానికీ అవకాశం కనిపించడం లేదు. ఏదోలా మోడీని బతిమిలాడుకోవడమే తప్ప.. బెదిరించే పరిస్థితి లేదు కనుక.. నిరాశపడకుండా ముందుకు సాగాలన్నదే ప్రస్తుతానికి బాబు వ్యూహం. 


మరింత సమాచారం తెలుసుకోండి: