ఎన్నికల పోస్టర్లనగానే మనకు గుర్తుకు వచ్చేది.. మన నేతలు చేతులు రెండూ దగ్గర పెట్టి ఓ నమస్కారం పెట్టే ఫోటోయే.. ఎన్నికలు దగ్గరపడగానే.. ఓ మాంచి ఫోటోగ్రాఫర్ ను పిలుచుకుని.. మెళ్లో పార్టీ కండువా వేసుకుని..  చిరునవ్వుతో దండం పెట్టే ఫోటో తీయించుకుంటారు. మీ ఓటు మాకే అనే టైపు క్యాప్షన్లు రాయించి ఊరి నిండా పంచేస్తారు. 


కానీ జపాన్ లో ఓ లీడర్ మాత్రం వెరైటీ ప్రచారం చేస్తున్నాడు. ఈ ఆదివారం అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లున్నాయట. అందుకే అందర్నీ ఆకర్షించేందుకు టెరుకీ గోటో అనే ఓ లోకల్ లీడర్ ఏకంగా బట్టలు విప్పేశాడు. దండం పెట్టి ఓట్లడగటం మన దగ్గర స్టైల్ ఐతే.. ఈ నాయకుడు ఏకంగా చేత్తో కత్తే పట్టుకున్నాడు. 


జపాన్ యుద్ధవీరుడి తరహాలో కత్తి ఎత్తిపట్టి ఒంటిపై నూలుపోగు లేకుండా పోస్టర్లు ముద్రించి ఊరంతా అంటించేశాడు. ఎలాగైనా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేసుకున్నాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ఈ గోటో.. ఈ వెరైటీ ప్రచారంతో బాగానే పాపులారిటీ సంపాదించాడు. 


మరీ నగ్న ఫోటో అయితే జనం జడుసుకుంటారనుకున్నాడో ఏమో.. మర్మావయవాలపై తన పేరు వచ్చేలా పోస్టర్లు డిజైన్ చేశాడు. జపాన్ లో నగ్న చిత్రాల ప్రచారంపై నిషేధం లేదు. అందుకే ఈ టెరుకీ ఈ ఛాన్స్ తీసుకున్నాడు. అన్నట్టు గతంలోనూ చాలామంది ఇలా ఎన్నికల్లో నగ్నకలకలం సృష్టించారు. ఐతే.. తమ నాయకుడిని గెలిపించాలంటూ కొందరు అమ్మాయిలు ఇలాంటి పనులు చేసినా.. ఏకంగా అభ్యర్థే ఇలా బట్టలిప్పేయడం మాత్రం వెరైటీనే.


మరింత సమాచారం తెలుసుకోండి: