తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత ఆయా రాష్ట్రాల అభివృద్దికి కృషి చేస్తున్నారు. ఇందు లో భాగంగా పన్నుల విధానాల్లో కొత్త కొత్త మార్పులు తీసుకు వస్తున్నారు. ఆ మధ్య ఎపీ వాహనాలుతెలంగాణలో ఎంటర్ అయితే  టాక్స్ విధించాల్సిందే అని టీ. రాష్ట్రం ఆంక్షలు విధించింది. ఇప్పుడు తాజాతా తెలంగాణ వాహనాలకు ఆంద్రప్రదేశ్ లో పన్ను చెల్లించవలసిందే. ఎపి ప్రభుత్వం కూడా ఎంట్రీ టాక్స్ ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


టోల్ గేట్ వద్ద వాహనాలపై ట్యాక్స్


తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఎపిలోకి ప్రవేశించే బస్ లు, లారీలు ఇతర వాణిజ్య వాహనాలకు ఇది వర్తిస్తుంది.తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను ఇతర రాష్ట్రాల వాహనాలుగా పరిగణిస్తారు. ఇందుకోసం చెక్ పోస్టుల వద్ద ఏర్పాట్లు చేశారు.ఇప్పటికే ఆంద్ర నుంచి వస్తున్న వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంట్రి టాక్స్ వేయడం , దానిని కోర్టులు కూడా సమర్ధించడం తో ఎపి ప్రభుత్వం కూడా అదే బాట పట్టింది. చివరికి రెండు రాష్ట్రాలు వాహనాలవారి మీద బారం మోపాయి


మరింత సమాచారం తెలుసుకోండి: