భారత దేశం నుంచి చాలా మంది బతకడానికి లేదా ఉన్నత విద్యలు అభ్యసించడానికి విదేశాలుకు వెళుతుంటారు. కొంతమంది అక్కడే స్థరపడతాడు, మరి కొంతమంది మాతృదేశానికి వస్తారు. అయితే సింగపూర్ లో ఓ చిన్నారిని కాపాడి భారతీయ యువకులు హీరోలు అయ్యారు. అంతే కాదు దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


పాపను కాపాడిన భారతీయులు


వివరాల్లోకి వెళితే...మూడేళ్ల వయస్సు ఉన్న ఓ చిన్నారిని పెను ప్రమాదం నుంచి ఇద్దరు భారతీయులు కాపాడారు. సింగపూర్‌లోని జోరాంగ్ ఈస్ట్ ఎస్టేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడేళ్ల చిన్నారి రెండో అంతస్థులో ఐపాడ్‌తో ఆడుకుంటోంది.  అలా ఆడుతూ అనుకోకుండా జారిపడింది అలా రెండో అంతస్థులో ఉన్న రెయిలింగ్‌లో ఇరుక్కుపోయింది. చిన్నారి తల స్లాబ్‌కు రెయిలింగ్ మధ్య ఇరుక్కుపోయింది. దీంతో గుక్కపెట్టి ఏడవటం మొదలు పెట్టింది. పాప ఏడుపు విని అక్కడే ఉన్న   ఇద్దరు భారతీయులు శ్యామ్‌ముగన్ నాథన్(35), ముత్తుకుమార్(24) గుర్తించారు. హుటాహుటిన అక్కడికి వెళ్లిన ఇద్దరు భారతీయులు చిన్నారిని సురక్షితంగా రక్షించారు. చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. చిన్నారికి పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.  సింగపూర్ ప్రభుత్వం ఆ భారతీయులను అభినందించి, హీరోస్ అని కీర్తీంచింది.   చిన్నారిని రక్షించడంతో ఇద్దరు భారతీయులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ప్రజా సంక్షేమ అవార్డును వారిద్దరికి బహుకరించింది. ఇలా మన ఇండియన్స్ హీరోలు అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: