గతంలో తెలంగాణ ప్రాంతంలోకి వాహనాలు ఎంట్రీ అయితే టాక్స్ విధించిన విషయం తెలిసిందే. నిన్న నుంచి ఏపీ ప్రభుత్వం కూడా ఎంట్రీ టాక్స్ విధించింది. ఎంట్రి టాక్స్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు బాగానే గిట్టుబాటు అయ్యేలా ఉంది. తెలంగాణ వాహనాలకు ఎపి చెక్ పోస్టుల వద్ద ప్రవేశపన్ను విధించడం ఆరంభమైంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 200 వాహనాల నుంచి కోటి ముప్పై లక్షల రూపాయలు వసూలు అయింది.


చెక్ పోస్టు వద్ద బారులు తీరిన లారీలు


ఒక్క రోజులోనే ఇంత పెద్ద ఎత్తున వసూళు కావడం అంటే మరి ముందు ముందు ఏ రేంజ్ లో వసూళ్లు అవుతాయో అని ఇరు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అయితే ప్రయాణీకులు మటుకు కాస్త పెదవి విరుస్తున్నారు. కొన్ని లారీలు, బస్ లు అర్ధరాత్రి కన్నా ముందే వచ్చినా, పన్ను వసూలు కోసం వాటిని ఆపారని సమాచారం. దాంతో వారంతా ఆందోళనకు దిగారు. కానీ ప్రభుత్వం నుంచి అంది అదేశాల ప్రకారం   అదికారులు పట్టు వీడకపోవడంతో పన్ను చెల్లించి వెళ్లక తప్పలేదు. ఒక్కపూటలోనే ఒక చెక్ పోస్టు వద్దే కోటి ముప్పై లక్షలు వసూలు అయితే అన్ని చెక్ పోస్టులలో కలిసితే బాగానే ఆదాయం రావచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: