తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ కి సంబంధించి అభివృద్ది కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు తెలంగాణలో నుంచి కొనసాగించే విధంగా ఇక్కడ కొన్ని భవనాలు వారికి కేటాయించారు. అయితే ఇప్పడు ఒక ట్విస్ట్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్వాకం చేసి నాలిక కరుచుకుంది.  ఎపి ప్రభుత్వం వినియోగిస్తున్న భవనాలకు ఆస్తి పన్ను చెల్లించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని సమాచారం.  దీంతో ఏపీ ప్రభుత్వం ఖంగు తింది.. అయితే తెంగాణా చేసిన తప్పిదానికి   ఎపి ప్రభుత్వం తెలివిగా సమాధానం ఇవ్వబోతోందట.


రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్


ఈ భవనాలకు ఆస్తి పన్ను ఏ ప్రాతిపదికన చెల్లించాలని అడుగుతున్నారో వివరణ ఇవ్వాలని ఎపి కోరుతోంది.విభజన చట్టం ప్రకారం ఈ భవనాలను ఎపి ప్రభుత్వానికి కేటాయించారు. సచివాలయం,మంత్రుల ఇళ్లు,ఎమ్మెల్యేల క్వార్టర్లు ,ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు హైదరాబాద్ లోని వివిధ భవనాలను వాడుకుంటున్నారు.ఆస్తి పన్ను కట్టాలంటే దానికి యజమాని అని గుర్తించినట్లు అవుతుంది. పదేళ్ల వరకు వాడుకోవడానికి అదికారం ఉంటే ఇప్పుడు పన్ను చెల్లించనవసరం లేదు.ఏ భవనానికి అయినా పన్ను కట్టేది యజమానేనని ,కనుక పదేళ్ల తర్వాత అమ్ముకునే హక్కు కూడా వస్తుందని ఎపి అదికారులు చెబుతున్నారు. భవనాలను కూడా జనాభా నిష్పత్తిలో అప్పట్లో విభజించారు. తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ అని ఎపి వాదిస్తోంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలా స్సందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: