భారత దేశ వ్యాప్తంగా ఈ రోజు నేపాల్ కేంద్రంగా నాలుగు దేశాల్లో భూకంపం హల్ చల్ చేసింది. ముఖ్యంగా భారత దేశంలో ఢిల్లీ, బిహార్, ఆగ్రా మరి కొన్ని ముఖ్య నగరాల్లో భూకంపం సంభవించింది. ఇది రిట్కర్ స్కేల్ పై 7.7 గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణ జిల్లా గొల్లపూడి, తూర్పూ గోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రాజమండ్రి,శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట గ్రామాల్లో, ఉర్లాం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం.

అయితే ఈ భూకంపంపై ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో స్పందించాడు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  అంతేకాదు భూకంప తీవ్రతపై అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని మోడీ ట్వీట్ చేశారు.


భూకంప ప్రభావంతో అతలాకుతలం అయిన ఇళ్లు, ప్రజలు

This picture shows the extent of damage of the Kathmandu Darbar Square, a UNESCO World Heritage site. The picture is taken from Twitter, shared by environmentalist Kashish Das Shrestha

ఉత్తర, ఈశాన్య భారతావనిలో భూకంపం ప్రభావం అధికంగా ఉందని ఆయన తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్ లో భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. నేపాల్ లో కూలిన భవంతుల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. వీటి కింద ఎవరైనా చిక్కుకుని ఉన్నారా? అన్న సంగతిపై సమాచారం వెలువడాల్సి వుంది. నేపాల్ లో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: