భారతీయులు చాలా మంది భక్తి కి ఎక్కువ ప్రాధానత్య ఇస్తారు. అనాధిగా దెవున్ని నమ్ముకొని చాలా మంది పుణ్యక్షేత్రాలకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. తమ కష్టాలన్నీ తొలగిపోవాలని జీవిత సాఫల్యం కోసం దేవున్ని ప్రార్థించడం పరిపాటే. కాని కొన్ని సమయాల్లో తీర్థయాత్రలకు వెళ్లిన కొంతమందికి అవాంతరాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఆ మధ్య కేథరినాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు పెను ప్రమాదం జరిగింది.
అది మరువక ముందే శనివారం నాడు నెపాల్ లో సంబవించిన భూ కంపానికి చాలా మంతి తీర్థయాత్రలకు వెళ్లిన వారు మృత్యు వాత పడ్డారు.


ముక్తినాథ్ ఆలయం

Muktinath Temple Tour
నెపాల్ లో ఖాట్మాండ్ లో ముక్తినాథ్ ని దర్శించుకోవడానికి వెళ్లిన హైదరాబాద్ లోని రామాంతపూర్ వాసులు 28 తెలుగు వారు అక్కడే చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మల్కాజ్‌గిరి సాయిబాబా ట్రావెల్స్‌లో వెళ్లిన వీరు శుక్రవారం నాడు ముక్తినాథ్‌ను దర్శించుకున్నారు. అనంతరం శనివారం ఖట్మాండ్‌కు చేరుకున్నారు.నేపాల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వేల మంది క్షతగాత్రులయ్యారు.

భూకంపం సంభవించిన నేపాల్, కాట్మాండ్ ప్రాంతాలు



క్షతగాత్రులకు ఖాట్మండులో రోడ్లపై చికిత్స చేస్తున్నారు.అయితే యాత్రికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులను ఆశ్రయించి తమ కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను గురించి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఖాడ్మాండ్‌లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వారి క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


కాట్మాండ్ దేవాలయం వద్ద కూలిపోయిన భవన సముదాయం



మరింత సమాచారం తెలుసుకోండి: