మనసు కు భాద కలిగితే కాస్త ఊరట కోసం గుడికి వెళ్లి గుడి ప్రాంగంణలో సేద తీరితే తృప్తి గా ఉంటుంది. లేదా ఏ మఠానికో వెళ్లి భజన చేస్తు కాస్త ఉల్లాసంగా ఉంటుంది. అయితే భారత దేశంలో సన్యాసులమని, స్వామీజీలమని చెప్పుకొని తిరిగే వారు స్వామీజీ ముసుగులో ఎన్నో అక్రమాలు, అన్యాయాలకు తెగబడుతూ ఉంటారు. ఇలాంటి కేసులు చాలా వచ్చాయి మన దేశంలో. తాజాగా కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హోసనగరలోని రామచంద్రాపుర మఠాధిపతి శ్రీ రాఘవేశ్వర భారతీ స్వామీజిపై భక్తురాలు, గాయని మీద స్వామీజి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి  ఈ ఆరోపణలు రుజువు అయ్యాయని సీఐడి అధికారులు అంటున్నారు.


భాదితురాలు , శ్రీ రాఘవేశ్వర భారతీ 


ఏ సమయంలోనైనా స్వామీజిని అరెస్టు చేసే అవకాశం ఉంది. బాధితురాలు నాలుగు సంవత్సరాల నుంచి తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని తెల్పింది. అంతే కాదు ఈ విషయం బయటకు పొక్కనిస్తే తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఆమె తన దుస్తుల మీద పడి ఉన్న స్వామీజి వీర్యాన్ని పోలీసులకు ఇచ్చింది. తమ కుటుంబ సభ్యులకు నిత్యం బెదిరింపు ఫోన్ లు వస్తున్నాయని బాధితురాలి కుమార్తె ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరులోని గిరినగర పోలీసులు స్వామీజి మీద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు స్వామీజికి విక్టోరియా ఆసుపత్రిలో ఐదు వైద్య పరీక్షలు నిర్వహించారు.


కేసు విచారణ కోసం ఎస్పీ, డీఐజీ, ఐజీ దర్యాప్తు చేసిన నివేదికను డీజీపీ, హోం శాఖ అధికారులకు అందివ్వనున్నారు. హిందూ మతానికి సంబంధిన స్వామీజీలను అరెస్టు చేస్తే మతపరమై ఘర్షనలు చోటుచేసుకుంటాయి కాబట్టి ఈ కేసు చాలా సున్నతమైనది అందు చేతనే   వారి అనుమతితో న్యాయస్థానంలో చార్జ్ షీట్ సమర్పించి స్వామీజిని అరెస్టు చెయ్యాలని సీఐడి అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: