జగన్, లోకేశ్.. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తును శాసించే అవకాశం ఉన్న యువనేతలు వీరే. ఒకరు ఇప్పటికే పార్టీ అధినేత.. ఇంకొకరు పార్టీని ఇప్పటికే కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న యువనేత. మరి వీరిద్దరిలో పోలికలున్నాయా.. ?


వీరిద్దరినీ కంపేర్ చేసి చెప్పాలంటే.. వారి గురించి బాగా తెలిసిన వారే అయి ఉండాలి. ఇద్దరి దగ్గరా పని చేసిన అనుభవం ఉండాలి. అలాంటి ఓ నాయకుడు లేటెస్టుగా వీరిని పోల్చి చెబుతున్నాడు. ఆయనే ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్.


నిన్న మొన్నటివరకూ వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వచ్చి  టీడీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన జూపూడి ప్రభాకర్ ఇప్పుడు అదే నోటితో టీడీపీని ఆకాశానికెత్తేస్తున్నాడు. రాజకీయాల్లో ఇవి కామనే అయినా.. జూపూడి భజన మరీ ఎక్కువైందంటున్నారు కొందరు. 


జూపూడి మాటల్లో చెప్పాలంటే.. జగన్ అరాచకవాది అట.. లోకేశ్ ప్రజాస్వామ్యవాది అట. లోకేశ్ ఆలోచనాపరుడట.. అదే జగన్ దురాశాపరుడట. లోకేశ్ పార్టీలో నాయకులను గౌరవిస్తాడట. అదే జగనైతే.. సీనియర్లకు కూడా మర్యాద ఇవ్వడట. లోకేశ్ ఏం చెప్పినా అర్థం చేసుకుంటారట. జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరిస్తారట. మరి అంత అరాచకవాది దగ్గర జూపూడి అన్నాళ్లు ఎలా పనిచేశారో..?


మరింత సమాచారం తెలుసుకోండి: