భారతీయ పత్రికల్లో అందులోనూ రాష్ట్రానికి సంబంధించిన ఓ ఇంగ్లీష్ పత్రికలో చైనా వాళ్లు ఆర్టికల్స్ రాయడం అరుదు. అందులోనూ ఏపీ రాజధాని అంశంపై.. ఆర్టికల్ రాయడం కలకలం సృష్టించింది. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చైనా పర్యటన చేసిన నేపథ్యంలో ఆస్టిన్ అనే ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ఈ ఆర్టికల్ రావడం ఇంకా టైమింగ్ గా ఉంది. 


చైనా పర్యటనలో చంద్రబాబు.. ఏపీ కాపిటల్ నిర్మాణంలోపెట్టుబడులు పెట్టమని చైనా కంపెనీలను, ప్రభుత్వాన్ని కూడా కోరారు. చైనా కంపెనీల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని సీఎంఓ చెప్పుకుంటున్నా ఇంతవరకూ కచ్చితమైన ప్రకటనలేమీ రాలేదు. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో చంద్రబాబు వైఖరిని నిశితంగా విమర్శిస్తూ ఈ వ్యాసం సాగింది.  




రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ఎక్కువగా కలలు కంటున్నాడని చైనా ప్రొఫెసర్ విమర్శించారు. చంద్రబాబు.. వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ సాయం కోరడం.. సింగపూర్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణ బాధ్యత అప్పగించడం అంత శ్రేయస్కరం కాదని ఆస్టిన్ అంటున్నారు. 



తన వాదనకు ఉదాహరణగా ఆస్టిన్.. సింగపూర్ సహకారంతో తయారైన సుజునో నగరం గురించి వివరించారు. ఈ నగరం సింగపూర్ వాటా తగ్గించుకున్న తర్వాతే లాభదాయకంగా మారిందన్నారు. ఏదేమైనా సార్వభామత్వం ఉన్న ఓ ప్రభుత్వం తన రాజధాని నిర్మాణం విషయంలో మరో దేశానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం మంచిది కాదని ఆస్టిన్ వివరించారు. మరి ఈ వ్యాసం సింగపూర్ జోక్యం వద్దని సూచిస్తూ చైనా చేసిన హెచ్చరికగా భావించాలా.. ఆస్టిన్ వ్యక్తిగత అభిప్రాయంగా భావించాలా..? 



మరింత సమాచారం తెలుసుకోండి: