కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణకు ఈ మధ్య ఏం కలిసి రావడంలేదు. ఆమధ్య తెలంగాణ అసెంబ్లీలో ఈమె పై రక రకాల వార్తలు వచ్చాయి. వార్తల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ భర్త  డీకే భరతసింహారెడ్డి మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న క్వారీలలోపనులు వెంటనే నిలిపివేయాలంటూ హైకోర్టు స్టే విధించింది. దాంతోపాటు ఆయనకు రూ. 33 కోట్ల జరిమానా కూడా విధించింది. తాజాగా డికె అరుణ  కుమార్తె స్నిగ్ధారెడ్డిపై 420 కేసు నమోదైంది.


డికె అరుణ భర్త భరతసింహారెడ్డి

డీకే భరతసింహారెడ్డికి రూ. 33 కోట్ల జరిమానా

అనుమతులకు మించి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణపై ఈ కేసు నమోదు చేసినట్టు ధరూర్ ఎస్‌ఐ అంజద్‌ఆలి తెలిపారు.  అక్రమ మైనింగ్ చేపట్టారని మైనింగ్ ఏడీఏ కృష్ణప్రసాద్ ఇటీవల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు మైనింగ్ డైరెక్టర్‌ను అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ ఏడీఏ కృష్ణప్రసాద్ ఫిర్యాదు చేయడంతో స్నిగ్ధారెడ్డిపై పీపీ యాక్టు కింద ఐపీసీ 420, 447, 379 కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: