తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు సోమవారం ఉదయం విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ని రిలీజ్ చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. మొత్తం 4 లక్షల 77 వేల మంది ఎగ్జాం రాయగా 2 లక్షల 32 వేల 742 మంది పాస్ అయ్యారు. అంటే 61.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. పోయిన ఏడాదితో పోల్చితే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ రిజల్ట్స్ లో కూడా అమ్మాయిలదే హవా. అబ్బాయిలు 59 శాతం పాస్ కాగా, అమ్మాయిలు 66.86 శాతం పాస్ అయ్యారు.


ద్వితీయ సంవత్సర ఫలితాలు వెల్లబుచ్చుతున్న మంత్రి కడియం శ్రీహరి


 సెకండియర్‌ పరీక్షల్లో రంగారెడ్డి జిల్లా(75శాతం)అగ్రస్థానంగా నిలవగా, నల్గొండ జిల్లా(50శాతం) చివరి స్థానంలో నిలిచింది. అలాగే రెండోస్థానంలో హైదరాబాద్‌, ఖమ్మం(64శాతం) నిలిచాయి. మే 25 నుంచి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్వాన్స్‌ సప్లంమెటరీ ఫీజు చెల్లింపు తేదీని మే 5గా నిర్ణయించారు. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు చింతించనవసరం లేదు.. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు కొన్ని రోజులు ముందుగా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు కడియం చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేసి మూడు వారాలపాటు సంబంధిత సబ్జెక్టులపై శిక్షణ ఇస్తారన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: