తెలుగు దేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత కూడా పార్టీని వీడి పోకుండా టీడీపీలోనే కొనసాగుతు ప్రతిపక్ష పార్టీలో కీలక భాద్యతలు నిర్వహిస్తున్న ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఇప్పడు కొత్త చిక్కుల్లో పడ్డాడు. టీడీపీ పగ్గాలు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డికి అప్పగించాలంటూ తెలుగు యువత పేరిట పోస్టర్లు వెలిశాయి. మహానాడులో ఈ మేరకు ప్రకటన చేయాలని తెలుగు యువత అందులో డిమాండ్ చేసింది.


రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వాలని పోస్టర్లు


ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నోటీసు బోర్డుల్లో కనిపించిన ఈ ప్రకటనలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తెలుగు యువత పేరుతో ఉన్న పోస్టర్లపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పోస్టర్ల వెనక తనకు ఎలాంటి సంబంధం లేదని రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తన వాక్పటిమతో రేవంత్ రెడ్డి వరుసగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలోని తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా మారాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు.


తనకేం సంబంధం లేదంటున్న రేవంత్ రెడ్డి

ఈ వ్యవహారంలపై రేవంత్ రెడ్డి గట్టిగానే స్పందించాడు. అసలు ఆ పోస్టర్లు ఎలా వెలిశాయో ఎందుకు వెలిశాయో తనకు తెలియదని నిజానికి చంద్రబాబు ను తానెంతో గౌరవిస్తానని అన్నారు.   పోస్టర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇది ఆకతాయిలు చేసిన పనిగా స్పష్టం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ నాయకత్వంలో పనిచేస్తున్నాని వారితో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన రాజకీయ భవిష్యత్‌ బాగుండాలంటే ఇలాంటి పనులు చేయవద్దని కోరారు. ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలో చంద్రబాబుకు అవగాహన ఉందని పేర్కొన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: