ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మూడు ప్రాంతాలున్న సంగతి తెలిసిందే.. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ.. తెలంగాణ ఎలాగూ విడిపోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అటు సమైక్య ఉద్యమం కూడా వచ్చింది. తెలంగాణకు వ్యతిరేకంగా సీమ, ఆంధ్ర కలసి సీమాంధ్ర, సమైక్యాంధ్ర అన్నాయి.

సీమాంధ్ర పేరుకు కలిసి ఉన్నా.. ఆంధ్రకు, తెలంగాణకు ఎంతో వైరుధ్యం ఉంది. భౌగోళిక పరంగానూ, వేషభాషలు, సంస్కృతుల పరంగానూ తేడాలున్నాయి. ఏపీ విభజనప్పుడే మూడు రాష్ట్రాలు చేయాలని అనుకున్నా.. చివరకు తెలంగాణ ఏర్పాటుతో సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది. 


ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి టిజి వెంకటేష్ రాయలసీమ స్వరం అందుకున్నారు. రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను సమంగా అబివృద్ది చేయకపోతే.. ఆంద్ర నుంచి రాయలసీమను తరిమేసే పరిస్థితి వస్తుందని అన్నట్టు సమాచారం. 

టీజీ వెంకటేష్ కు రాయలసీమ ఉద్యమం నడిపిన అనుభవం ఉంది. రాయలసీమ హక్కుల వేదిక పేరుతో ఓ సంస్థను కూడా నడిపారు. రాజధాని కూడా ఆంధ్రలో ఏర్పాటు చేయడం, రెండో రాజధాని లేకపోవడం వంటి అంశాలతో మళ్లీ.. రాయలసీమ ఉద్యమం ఊపందుకునే అవకాశాలున్నాయి. మరి టీజీ వెంకటేశ్ ఓపిగ్గా రాయలసీమ ఉద్యమం నడిపిస్తారా.. ఏదో ఓ రాయి వేసి చూద్దామని అనుకున్నారా.. తేలాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: