కేసీఆర్ నోటి దురుసు సంగతి అందరికీ తెలిసిందే. ఇదేం కొత్త కాదు.. గతంలో ఆయన చాలామంది లీడర్లను భయంకరంగా తిట్టేశాడు. కాకపోతే అప్పుడు ఆయన ఉద్యమ నేత. ఆయన ఆవేశానికి అర్థం ఉందని సర్దిచెప్పుకునేవారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి అలాంటి గౌరవనీయ హోదాలో ఉండి


కానీ ఇప్పుడాయన తెలంగాణ ముఖ్యమంత్రి. అలాంటి గౌరవనీయ హోదాలో ఉండి.. మరో ముఖ్యమంత్రిని పట్టుకుని అంతలా తిట్టేయడం సంస్కారం అనిపించుకుంటుందా.. ఇంతకీ కేసీఆర్ ఏమన్నాడు.. ఏమన్నడో ఆయన మాటల్లోనే.. మన పక్కరాష్ట్రం ముఖ్యమంత్రి కిరికిరినాయుడని ఉన్నడు. ఆయన ప్రతిదానికీ పుల్లలు పెడ్తుంటడు. ఆయనకో రాజ్యముంది.. ప్రజలున్నారు.. అక్కడ సమస్యలున్నాయి. నీకీడే ఏం పనయ్యా చీఫో అన్నా.. పోకుండ ఇక్కడనే ఉంటడు. 

కేసీఆర్ తిట్టేయడం అందర్నీ ఆశ్చర్యపరచింది


నీకిక్కడేం పనయ్యా.. నీ జనం అక్కడున్నారు.. నవ్వూ అక్కడే సావు పో.. ఇదీ ఇలాసాగిపోయింది. ఏకంగా చావుపో.. అని కేసీఆర్ తిట్టేయడం అందర్నీ ఆశ్చర్యపరచింది. కేసీఆర్ నాటు అని తెలుసు కానీ..మరీ ఇంత నాటనుకోలేదు.. అని ముక్కునవేలేసుకున్నారు. అంతకుమించి ఆయనకు చెప్పగలిగేవారు ఎవరున్నారు.. చెప్పండి.



మరింత సమాచారం తెలుసుకోండి: