పవన్ కళ్యాన్ జనసేన పార్టీ స్థాపించినప్పటికీ ఎన్నికల్లో నిలబడలేదు. అంతే కాదు టీడీపీ, బీజేపీ కి మద్దతు తెలిపి వాటి గెలుపునకు పరోక్షంగా సహాయ పడ్డాడు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పాలనలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాన్ మటుకు చంద్రబాబు నుంచి ఓ హామీ తీసుకున్నారని తెలుస్తుంది. పసుపులేటి హరిప్రసాద్ అనే వ్యక్తి గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం అనే పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఈయన పవన్ కు కాస్త దగ్గర. అంతే కాదు తిరుపతిలో ఓ కార్పోరేట్ హాస్పిటల్ ఉంది. స్థానికంగా తిరుపతిలోనే ఉండే వ్యక్తి కనక అప్పట్లో ప్రజారాజ్యం గురించి కాస్త ఉత్సాహంగా తిరిగారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడంతో హరిప్రసాద్ రాజకీయంగా కాస్త దెబ్బతిన్నారు. ఇది దృష్టింలో ఉంచుకొని పవన్ ఆయనకు హామీ ఇచ్చాడు అది టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇప్పిస్తానని అనుకున్నట్లే ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు.


ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకులు చిరంజీవి



పసుపులేటి హరి ప్రసాద్ అనే ప్రముఖుడికి టిటిడి బోర్డు సభ్యత్వం రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉందని అంటున్నారు. టీటీడీ బొర్డులో సిఫార్సు తోనే అందరూ వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వి.కృష్ణమూర్తికి బిజెపి అద్యక్షుడు అమిత్ షా , చెన్నైకి చెందిన జె.శేఖర్ కు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత,కర్నాటకకు చెందిన డిపి అనంతకు కేంద్ర మంత్రి ఉమాభారతి, తమిళనాడుకు చెందిన సంపత్ రవి నారాయణకు కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ సిఫారస్ ఉన్నాయని చెబుతున్నారు.


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పసుపులేటి హరిప్రసాద్


కాగా పారిశ్రామికవేత్త ఎల్లా సుచిత్ర కు చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో టిడిపితో అనుబంధం ఉన్న ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు తిరుమలలో తలనీలాలు సమర్పించుకున్న తర్వాత తన పదవి వచ్చినట్లు తెలియడంపై ఆనందంగా ఉన్నారు.కాగా ఈ బోర్డు పదవి ఏడాది మాత్రమే ఉండడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: