ఉత్తర అమెరికా తెలుగు సంఘం( తానా) అధ్యక్షుడిగా సతీష్‌ వేమన గెలుపొందారు. అయితే ఈ గెలుపు మొదటి నుంచి  లాంచనమే అయినా పోటీ మాత్రం ఏర్పడింది. ఇప్పడు  ప్రవాస భారతంలో అతి పెద్ద తెలుగు వారి సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలలో సతీష్ వేమన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన సతీష్‌ వేమన తన ప్రత్యర్థి రామ్‌ యలమంచిలిపై 5120 ఓట్ల తేడాలో భారీ విజయాన్ని సాధించారు. సతీష్‌కు 8257 ఓట్లు రాగా, రామ్‌కు 3137 ఓట్లు వచ్చాయి.


గెలిచిన టీమ్ తో సతీష్‌ వేమన


ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి సతీష్‌ వేమన ఆధిక్యాన్ని కనబరిచారు. వేమన ప్యానెల్‌లో ఉన్న మధు తాతా, మురళీవెన్నం, రవి పొట్లూరి కూడా భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఎన్నికల ఫలితాలను తానా ఎన్నికల కమిటీ అధ్యక్షుడు పాపారావు గుండవరం ప్రకటించారు. సతీష్‌ వేమన స్వస్థలం కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం బొమ్మవరం కమ్మపల్లె. రాయలసీమ నుంచి తానా అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా సతీష్‌. 2011-13 వరకూ తానా కోశాధికారిగా, ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు సతీష్‌ విజయం పట్ల తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌ హర్షం వ్యక్తం చేశారు. గెలుపోటములు సహజమని, సంస్థ లక్ష్యాలను అన్ని వేళలా కాపాడేవారికి తన సహకారం తప్పకుండా ఉంటుందని ఆయన అన్నారు. తానా ప్రస్తుత, మాజీ కార్యవర్గ సభ్యులు, పలు జాతీయ స్థాయి ప్రవాసాంధ్ర సంఘాలు, ప్రవాసాంధ్ర ప్రముఖులు సతీష్‌కు అభినందనలు తెలిపారు.


సతీష్ వేమన శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్

Satish Vemana and his panel wins TANA Elections with huge majority

ఈ విజయాన్ని అందించిన డీసీ నగర ప్రవాసాంధ్రులకు సతీష్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్జీనియాలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో సతీష్‌ పాల్గొన్నారు. తానా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సతీష్‌ వేమనకు అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జంపాల చౌదరి, మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, తోటకూర ప్రసాద్‌, నాదెళ్ల గంగాధర్‌, గొర్రపాటి నవనీతకృష్ణ, సూదనుగుంట రాఘవేంద్ర ప్రసాద్‌, డీసీ ప్రాంత ప్రవాసాంధ్ర ప్రముఖులు డాక్టర్‌ యడ్ల హేమప్రసాద్‌ తదితరులు అభినందనలు తెలిపారు.


అధ్యక్షుడు - సతీష్ వేమన
ఫౌండేషన్ ట్రస్టీలు - రమాకాంత్ కోయ, శ్రీనివాస్ లావు, అనిల్ లింగమనేని, అనిల్ కుమార్ వీరపనేని
కార్యదర్శి -  మధు తాతా
కోశాధికారి - మురళీ యెన్నం, 
జాయింట్ సెక్రటరి - రవి పొట్లూరి    


మరింత సమాచారం తెలుసుకోండి: