చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మరోసారి పనిచేసింది. తన పార్టీకి తెలంగాణలో గడ్డు పరిస్థితి వస్తున్నా.. ఆయన వెరవకుండా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నాడు. ఊరికే రెండు కళ్ల డైలాగ్ కొట్టి.. నోటిమాటే అనిపించుకోకుండా గట్టి చర్యలే తీసుకున్నాడు. 



గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు చదలవాడ కృష్ణమూర్తికు ఆ పదవి కట్టబెట్టి చంద్రబాబు తన హామీ నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో తిరుపతి ఎమ్మెల్యే టిక్కెట్టు చదలవాడకు ఇవ్వాల్సి ఉండగా...., టీటీడీ ఛైర్మన్ ఇస్తామన్న హామీతోనే ఆయన ఎమ్మెల్యే స్థానం వదులుకున్నారు. బోర్డు మెంబర్ల విషయానికొస్తే... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు శాసనసభ్యులకు స్థానం కల్పించారు. 


ప్రత్యేకించి తెలంగాణవాళ్లు ఇద్దరికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం విశేషం. సండ్ర వెంకటవీరయ్య వరుసగా రెండు సార్లు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటు సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి 2009 మినహా 1994 నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు. తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు వేసిన ఈ ఎత్తుగడ బాగానే ఫలించేలా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: