ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ గండం ఎలా గట్టెక్కుతారో చూడాలి. ఎలా ఉపశమనం పొందుతారో చూడాలి. భారతదేశంలో కేంద్రప్రభుత్వాలనే ‘డిసైడ్‌’ చేయగల స్థాయిలో ఉన్న రిలయన్స్‌ కుటుంబానికి చెందిన నీతా అంబానీ ఇప్పుడు ఆయన మీద గుర్రుమంటున్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


ఇంతకూ విషయం ఏంటంటే.. భారతదేశపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాపు అధినేతల కుటుంబానికి చెందిన నీతా అంబానీ తిరుమలేశుని సేవ మీద మక్కువ పెంచుకున్నారు. తిరుమల శ్రీవారి పట్ల రిలయన్స్‌ సంస్థలు ఎంతటి భక్తి ప్రపత్తులతో ఉంటాయో అందరికీ తెలుసు. ముంబాయినుంచి ప్రత్యేక విమానంలో వారు తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకుని కోట్లాదిరూపాయల కానుకలు తరచూ సమర్పించుకుని వెళుతుంటారు. నిజానికి టీటీడీ ఛైర్మన్‌ కంటె ఎక్కువ వైభోగంగానే వారికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అయినా సరే.. పదవిలో ఉండి భగవంతుడికి సేవ చేయాలని నీతా అంబానీ కోరుకున్నారు. ఈ కోరికను ఆమె చంద్రబాబు వద్ద కూడా బయటపెట్టినట్లు సమాచారం. 


నిజానికి చాలా కాలం ముందునుంచే నీతా అంబానీ ఈ పదవికోసం ప్రయత్నిస్తున్నారు. హుధుద్‌ తుపాను బాధితులకోసం రిలయన్స్‌ సంస్థల తరఫున 11 కోట్ల రూపాయల విరాళం చెక్కు ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఏపీలోని కొందరు పెద్దలు కూడా.. చంద్రబాబు వద్ద ఆమెకు పదవికోసం ఒత్తిడి చేశారుట. అయితే.. చంద్రబాబు.. చదలవాడకు ఇచ్చిన మాట తప్పితే.. రాజకీయంగా ఇక తనను ఎవరూ నమ్మరనే ఉద్దేశంతో ప్రస్తుతానికి కుదరదని.. నెక్స్ట్‌ టైం ఇస్తాం అని చెప్పి తప్పించుకున్నారట. అయితే బోర్డు మెంబర్‌ ఇస్తానని ఆఫర్‌ చేస్తే ఆమె తిరస్కరించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క పదవి అడిగితే.. ఇవ్వలేదని చంద్రబాబు మీద నీతా అంబానీ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరి చదలవాడ కు దక్కవలసిన రెండేళ్ల పదవీ కాలాన్ని ఏడాదికి కుదించిన చంద్రబాబు.. ఆయన పదవి పూర్తయిన తర్వాత.. నీతా అంబానీ కట్టబెడతారో లేదా, ఈలోగానే ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: