గత కొంతకాలంగా ఢిల్లీ నగరం నిశ్శబ్దంగా ఉంది. గతంలో ఢిల్లీని టార్గెట్ చేసి ముష్కరు దాడులు విపరీతంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీపై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. లష్కరేతోయిబా, జైష్‌మహమ్మద్ సంస్థలు డ్రోన్లతో దాడులు చేయవచ్చని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీపై టెర్రరిస్టులు దాడులకు విరుచుకుపడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకు దేశంలోకి అక్రమ మార్గాల్లో చొరబడి ప్రత్యక్ష దాడులకు దిగిన ఉగ్రవాదులు, తాజాగా మునుపెన్నడూ లేని విధంగా డ్రోన్లతో దాడులు చేసేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.


తాజ్ హోటల్ పై ఉగ్రదాడుల దృశ్యం (ఫైల్)


 ప్రపంచ దేశాలకు కొరకరాని కొయ్యగా మారిన ఉగ్రవాద సంస్థలు లష్కరే ఈ తోయిబా, జైషే భారత్ లో ఉగ్రవాద సంస్థలు ఈ దాడులకు పాల్పడవచ్చు అని నిఘా వర్గాలు తెలిపాయి.  ఢిల్లీలో పోలీసులు, భద్రతాదళాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 


గతంలో ఉగ్ర్ దాడుల్లో ప్రమాదానికి గురైన ప్రజలు

ఢిల్లీపై అది డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించాలని చూస్తోందని, అప్రమత్తంగా ఉండాలని మంగళవారం హెచ్చరించింది. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. 50 అడుగుల దూరంలో డ్రోన్ దాడులు నిర్వహించే దిశగా ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.




మరింత సమాచారం తెలుసుకోండి: