టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ లో ఆ పార్యీ యువనేత ఓ సంచలన విషయం బయటపెట్టారు. సొంత పార్టీ నేతల బండారాన్ని బయటపెట్టేశాడు. టీడీపీ నేతలంతా ఊరికే ప్రచారం కోసమే పాకులాడతారు తప్ప చేతల్లో అంత సీన్ లేదని ఆయనే స్వయంగా తేల్చేశారు. 

మాటలే తప్ప చేతలేవీ..?


సాక్షాత్తూ గత మహానాడులో ఇస్తామని ప్రకటించిన విరాళాలకే ఇంకా దిక్కులేదన్న సంగతి లోకేశ్ పోలిట్ బ్యూరోలో బయటపెట్టాడు. నాయకులు 14 కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించినా చివరకు పార్టీ చేతికి అందింది మాత్రం కేవలం మూడున్నర కోట్లు రూపాయలు మాత్రమేనంటూ ఓ నివేదిక ఇచ్చాడు లోకేశ్.  

కార్యకర్తల సంక్షేమ విభాగం తరఫున తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయ కర్త హోదాలో నారా లోకేష్ ఈ నివేదిక అందించారు. ఈ నివేదికలో తన పనితీరును లెక్కలతో సహా ప్రొజెక్టు చేసుకున్నాడీ యువనేత. గత 10నెలల కాలంలో 50వేల మంది కార్యకర్తలను కలుసుకున్నట్లు వివరించాడు లోకేష్ . 

భలే బాగా పని చేస్తున్నా..! 


పార్టీ తరపున విద్య కోసం ఆంధ్రప్రదేశ్ లో 123మంది, తెలంగాణలో 131మందికి ఆర్థికసాయం అందించినట్లు లోకేశ్ నివేదికలో పేర్కొన్నారు. వివాహం, ఆరోగ్యం, ఆర్థిక అవసరాలకు ఆంధ్రప్రదేశ్ లో 170మంది, తెలంగాణలో 286 మందిని ఆదుకున్నట్లు నివేదించారు. కార్యకర్తల పిల్లల కోసం ఉద్యోగమేళాలు నిర్వహించి 465మందికి ఉద్యోగాలు అందేలా చేసినట్లు లోకేశ్   నివేదికలో తెలిపాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: