తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కేసీఆర్ నిరాహారదీక్ష మలుపు తిప్పిన సంగతి తెలిసిందే.. దశాబ్దాల తరబడి పడుతూ లేస్తూ వచ్చిన ఉద్యమం.. కేసీఆర్ దీక్షతో శిఖరస్థాయికి చేరుకుంది. సోనియా ఆధ్వర్యంలోని యూపీఏ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదనే పరిస్థితి కల్పించింది.

కేసీఆర్ దీక్ష గుట్టు విప్పుతారా..?


ఐతే.. కేసీఆర్ నిరాహరదీక్షపై అనేక వివాదాలున్నాయి. దీక్ష మొదలుపెట్టిన రెండు రోజులకే ఆయన ఖమ్మంలో దీక్ష విరమిస్తున్నట్టు ప్రకటించారు. నిమ్మరసం కూడా తాగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు గద్దర్‌ వంటి ప్రముఖులు దీనిపై భగ్గుమనడంతో కేసీఆర్.. తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. కేసీఆర్‌ను నిమ్స్‌కు తరలించారు.
దీక్ష వెనుక టాప్ సీక్రెట్స్..?


ఇక్కడే అనేక కీలక పరిణామాలు జరిగాయి.. దాదాపు 14 రోజుల తర్వాత డిసెంబర్ 9న  యూపీఏ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై విస్పష్ట ప్రకటన చేసింది. కేసీఆర్ దీక్ష విరమించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ నిమ్స్ లో చేరిన తర్వాత.. దీక్ష విరమణకు ముందు చాలా రాజకీయం నడిచిందట. దీక్ష కొనసాగించలేక.. కేసీఆర్ ఓ పత్రికాధిపతిని ఆశ్రయించారట.
కేసీఆర్ పత్రికాధిపతిని ఏం కోరారు..?


ఈ విషయం ఆ పత్రికాధిపతే స్వయంగా తన పత్రికలో రాశారు. ఐతే.. కేసీఆర్ తనను ఎలా రంగంలోకి దించిందీ ఆయన వెల్లడించలేదు. ఆ విషయం మరోసారి వివరంగా రాస్తానని సస్పెన్స్ లో ఉంచేశారు. ఇప్పుడా టాప్ సీక్రెట్ ఏంటన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: