చదలవాడ కృష్ణమూర్తి.. రాజకీయాల్లో వేచి ఉంటే ఫలితం తప్పకుండా ఉంటుందనడానకి ఈయన ఓ ఉదాహరణ. చంద్రబాబు సొంత జిల్లాకే చెందిన వాడయినా.. కృష్ణమూర్తి ఇన్నాళ్లు అసంతృప్తితోనే పార్టీలో కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయన్ను టీటీడీ ఛైర్మన్ పదవి వరించింది. 
వెంకన్న ప్రాణమిచ్చాడు..


చదలవాడ కృష్ణమూర్తికి ఇంకో ప్రాముఖ్యత ఉంది. 2003-04 సమయంలో అలిపిరిలో చంద్రబాబుపై మావోయిస్టులు దాడి చేసిన సమయంలో చంద్రబాబు పక్క సీట్లో కూర్చొన్న వ్యక్తి చదలవాడే. మావోయిస్టుల పథకం సరిగ్గా అమలై ఉంటే.. అలిపిరిలోనే ఊపిరిపోవాల్సినవాడు. 
చంద్రన్న పదవి ఇచ్చాడు..


అలిపిరి వద్ద ప్రాణాలతో బయటపడటంతో.. అంతా వేంకటేశ్వరుడి చలవే అని అంతా అనుకున్నారు.టీడీటీ పదవి అందుకున్న వేళ చదలవాడా అదే అన్నారు.. ఆ వేంకటేశ్వరుడు అలిపిరిలో ప్రాణమిచ్చాడు.. ఇప్పుడు చంద్రబాబు పదవి ఇచ్చాడు.. ఆయన ప్రాణమిచ్చాడు.. ఈయన పదవి ఇచ్చాడు.. అంటూ చదలవాడ మురిసిపోయారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: