యూపీఏ పాలనతో దేశ ఆర్ధికాభివృద్ధికి అవసరమైన సానుకూల పెట్టుబడి వాతావరణం ధ్వంసమైంది. ప్రాజెక్టులు నిలిచి పోయాయి. స్వదేశంలో వ్యాపారం చేయడం కన్నా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడమే మంచిదన్న నిర్ణయానికి భారత పారిశ్రామిక సంస్థలు వచ్చాయి. సౌకర్యాలు లేని కారణంగా వ్యాపారానికి పెట్టుబడులకు అనుకూలమైన 189 దేశాల జాబితాలో భారత్‌ 142 వ స్థానంలో నిలిచింది.  దేశ రాష్ట్ర ఆర్ధికాభివృద్దిని పెంచడం కోసం ప్రధాని నరేంద్ర మోడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రం గా కృషి చేస్తున్నారు. నరేంద్ర మోడి మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంతో ముందుకు పోతుంటే, సిఎం చంద్రబాబు నాయుడు మేడ్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో ముందుకు సాగుతున్నారు. 


మోడి ఇచ్చిన మేక్‌ ఇన్‌ ఇండియా 


దారి తప్పిన దేశ పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి మోడి ఇచ్చిన మేక్‌ ఇన్‌ ఇండియా పిలుపు విజయవంతం అయితే.. దేశ పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగి,ఎగుమతులు వృద్ధి చెంది దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. సిఎం చంద్రబాబు ఇచ్చిన మేడిన్‌ ఏపీ విజయవంతం అయితే.. నవ్యాంధ్ర లో పారిశ్రామిక రంగం అభివృద్ది చెంది యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమల స్థాపనకు విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు సింగపూర్‌, జపాన్‌, చైనా వంటి దేశాల్లో సిఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్య టించి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఏయే పరిశ్రమలు స్థాపించవచ్చో పారిశ్రామిక వేత్తలకు వివరించి వారిని ఒప్పించి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అష్ట కష్టాలు పడుతున్నారు


విజ్ఞత, రాజనీతిజ్ఞత, భాద్యత లేని పాలకుల కారణంగా అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించడం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అష్ట కష్టాలు పడుతున్నారు. అత్యుత్తమ విధానాలు పాలన పద్దతులు ప్రపంచంలో ఏ మూలన ఉన్న అక్కడికి వెళ్ళి అధ్యయనం చేసి, అవి రాష్ట్రానికి అన్వయించడానికి అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ లోటు,రాజధాని నిర్మాణం, రైతు రుణ మాఫీ, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కొరత వంటి ప్రతిబంధకాలను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంటూ నిరంతర శ్రమతో పరుగెడుతున్నారు. అందుకే 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగపూర్‌, జపాన్‌ దేశాల్లో సిఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆ రెండు దేశాలు రాజధాని నిర్మాణంలో సహకరించడానికి ముందుకు వచ్చాయి. 

సింగపూర్‌ కొత్త రాజధాని నిర్మాణానికి


సింగపూర్‌ కొత్త రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది. చైనా పర్యటన సందర్భంగా మొత్తం 29 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు 17 ఒప్పందాలు ప్రభుత్వం బిజినెస్‌ కాగా 12 బిజినెస్‌బిజినెస్‌ ఒప్పందాలు జరిగాయి. చైనా పర్యటనలో పలువురు ప్రము ఖులను వ్యాపార వాణిజ్య రంగా దిగ్గజాలను ప్రవాస భారతీయులను కలుసుకొని ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఏపీ లో పెట్టుబడులు పెట్టె చైనా పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం ఒక ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు సిఎం చంద్రబాబు ప్రకటించారు. నవ్యాంధ్రను పారిశ్రామిక హబ్‌ గా తీర్చి దిద్దేందుకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నూతన పారిశ్రామిక విధానం ప్రకటించారు.  2020 నాటికి పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రాన్ని ఆగ్ర స్థానానికి చేర్చాలనే లక్ష్యం తో ఇతర రాష్ట్రాల కన్నా మెరుగైన రాయితీలు ప్రకటించారు. పరిశ్రమలకు భూములను 99 ఏళ్ల పాటు లీజ్‌ కి ఇవ్వడం పరిశ్రమల కోసం భూ బ్యాంక్‌సిద్దం చెయ్యడం, 21రోజుల్లో అనుమతులు ఇవ్వడం వంటి రాయితీలు ప్రకటించారు.

రేటుతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది


తయారీ రంగమే ఏ దేశానికి అయిన, రాష్ట్రానికి అయినా వెన్ను దన్నుగా నిలుస్తుంది. అమెరికా, జపాన్‌, జర్మనీ, కొరియా, చైనా తదితర దేశాలు వేగంగా అభివృద్ది సాధించడానికి ఉత్పత్తి రంగానిదే కీలక పాత్ర. మొదటి నుండి మన ప్రభుత్వాలు తయారీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అవసరమైనప్పు డు అంతర్జాతీయ మార్కెట్‌ నుండి దిగుమతి చేసుకోవడమే మనకు తెలిసిన విద్య. ఏ వస్తువులైన స్వయంగా తయారు చేసుకోగలిగితే విదేశాలపై ఆధారప డాల్సిన అవసరం ఉండదు. దాంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి స్వదేశం లో మనం కొంటున్న వస్తువులు ఎక్కువగా చైనా, జపాన్‌, బెల్జియం వంటి దేశాల్లో తయారైనవే. ఎలక్ట్రానిక్‌, అత్యాధునిక యంత్ర సామగ్రి, రక్షణ ఉత్పత్తుల వంటి వాటి కోసం విదేశాలపై కొంత వరకు ఆధార పడవచ్చు. పెద్దగా సాంకేతిక నైపుణ్యం అవసరం లేని ఫర్నిచర్‌, ప్లాస్టిక్‌ వస్తువులను కూడా మన దేశం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. దేశంలో వృద్ధి రేటు మందగించి 5 శాతం వృద్ధి రేటుతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. 

మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం కింద మోడి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు సమున్నతం గానే ఉన్నాయి. 2022 నాటికి జిడిపిలో ఉత్పత్తి రంగం వాటా 25 శాతానికి పెంచుకోవాలని, ఉత్పత్తి రంగం లో 10 కోట్ల ఉద్యోగాలు, సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధ్యమైన మేర విదేశ కొనుగోళ్లు తగ్గించి దేశీయంగా తయారు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందు కోసం కేంద్రం పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాలి. వ్యూహాత్మకంగా కొన్ని ప్రాజెక్టులను తానే ప్రారంభించి అందులో ప్రజా సంస్థలతో పాటు ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పించాలి.


ప్రధాని నరేంద్ర మోడి ఉత్పత్తి రంగం ప్రాధాన్యత గుర్తించి


రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఆయుధ సామగ్రి, ఇంజనీరింగ్‌ ప్లాస్టిక్‌ వీడి భాగాలు వంటివి అధికం గా దిగుమతి చేసుకుంటున్నాము. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు అయితే దాదాపు నూటికి 90 శాతం దిగుమతి అవుతున్నాయి. 2020 నాటికి మన దేశంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల మార్కెట్‌ 40 వేల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మేకిన్సే అండ్‌ కంపెనీ నివేదిక ప్రకారం మన దేశంలో ఉత్పత్తి రంగం 2025 నాటికి లక్ష కోట్లు డాలర్ల స్థాయికి చేరుకుం టుందని అంచనా. టిడిపిలో 30 శాతం వరకు ఉత్పత్తి రంగం వాటా ఉండవచ్చు అని, తొమ్మిది నుంచి పది కోట్ల మేర ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా.ప్రధాని నరేంద్ర మోడి ఉత్పత్తి రంగం ప్రాధాన్యత గుర్తించి పెట్టుబడులు ఆకర్షించేందుకు దేశ దేశాలు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. 


మేక్‌ ఇన్‌ ఇండియా భావనను మరింత విస్తృత పరచాలి అందుకోసం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాలి అవసరమైన ప్రోత్సాహకాలు కల్పించి విధానపరమైన మద్దతు ఇవ్వాలి. జపాన్‌, కొరియా, దేశాల పరిజ్ఞానాన్ని ఎలక్ట్రానిక్‌ రంగం లో చైనా పరిజ్ఞానాన్ని హార్డ్ వేర్‌ రంగంలో ఉపయోగించుకోవాలి. ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచ వాణిజ్య పటంలో భారత్‌ ను భూతద్దం లో వెతకాల్సిన పరిస్థితి నెలకొన్నది. కావున దేశం లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: