ఈ మాట అంటున్నది ఎవరో కాదు తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా అందరి మన్ననలు పొందిన దాసరి నారాయణ రావు. ఓ ప్రముఖ పత్రికు ఇంటర్వూ ఇస్తూ గత అనుభవాలు నెమరు వేసుకున్నారు. అప్పట్లో కేసీఆర్ నాతో సినిమా చేయాలని అడిగారు. కేసీఆర్ అప్పటికి టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు. ఇద్దరం కలిసి ఓ సినిమా తీయాలని ప్రపోజల్ పెట్టారు.కానీ కొన్ని అనువార్య కారణాల వల్ల ఆది కార్యరూపం దాల్చలేదు.  


సినీ నటుడు పవన్ కళ్యాన్ తో దాసరి నారాయణరావు


 కేసీఆర్‌కు, నాకు మధ్య చక్కటి అనుబంధముంది. ఆయన ఎప్పుడు పిలిచినా వస్తాను. కేసీఆర్ గొప్ప విషయ పరిజ్ఞానం వున్న వ్యక్తి. ఆయన పుస్తకాలు బాగా చదువుతాడు. పురాణాలు, ఇతిహాసాల మీద మంచి పట్టుంది. ఎలాంటి అంశంపైనైనా సాధికారికంగా మాట్లాడగలడు అన్నారు. ఆయన ఏ పనైనా చేపట్టాలనుకుంటే అది పూర్తి అయ్యే వరకు దాని విడిచిపెట్టరు. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా తీర్చిదిద్దుతాననే కేసీఆర్ సంకల్పం చాలా గొప్పది. విస్తృత ప్రయోజనాలను నెరవేర్చే సినిమా హబ్ గురించి ఇప్పటివరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. సినిమా ఇండస్ట్రీలో వెల మంది బతుకుతున్నారు. సినిమా హబ్ ఏర్పడితే లక్షల్లో ఉపాది పొందే అవకాశం లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: