ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత కేజ్రీవాల్ కి ఈ మద్య అసలు కలిసి రావడం లేదు. సొంతపార్టీలో వ్యతిరేకత వచ్చింది. ఆ మధ్య భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ చేపడితే ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేజ్రీవాల్ క్షమాపన చెప్పాడు ఎందుకంటే ఆ రైతు మరణించే సమయంలో తను పది నిముషాల వరకు స్పీచ్ ఇచ్చినందుకు . ఇప్పుడు కేజ్రీవాల్ పై  ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్  ఫైర్ అయ్యారు.


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్


ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనకు చెందిన ఫైల్స్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం లేదని అన్ని శాఖలకు చెప్పిన నేపథ్యంలో నజీబ్ జంగ్.. తాజాగా అందరు మంత్రులకు, అధికారులకు ఆ ఆదేశాలు జారీ చేశారు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలు, ఆమోదం తెలిపేచట్టాలు తనకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. నజీబ్ జంగ్ బీజేపీ ఏజెంట్ అని గతంలో కేజ్రీవాల్ ఆయనను తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: